Tamannaah Bhatia Net Worth : తమన్నా ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Tamannaah Bhatia Net Worth

మిల్కీ బ్యూటీ తమన్నాకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా అన్ని భాషలలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది తమన్నా. మంచు మనోజ్ తో కలిసి “శ్రీ” అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పరిశ్రమలోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తికావస్తున్నాయి. అయినా ఈమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తోంది.

తెలుగులో ఉన్న సీనియర్ హీరోలకు తమన్నా ఒక ఆప్షన్ గా ఉంది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ అమ్మడు అక్షరాలా పాటిస్తోంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్ని విడిచి పెట్టుకోకుండా సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, వెబ్ సిరీస్ లతోపాటు అన్ని చేసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలోనే తమన్నా తీసుకుంటున్న రెమ్యూనరేషన్, ఆస్తుల విలువపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. ఈమె ప్రస్తుతం సినిమాకు 4 నుండి 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక పలు యాడ్స్, బ్రాండ్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్ల రెమ్యూనరేషన్ తన ఖాతాలో వేసుకుంటుందట.

ఇవే కాకుండా ఫారిన్ కంట్రీస్ లో ఫుడ్ బిజినెస్ చేస్తుందట తమన్న. వైట్ అండ్ గోల్డ్ పేరుతో జువెలరీ బిజినెస్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా మంచి సక్సెస్ తో రన్ అవుతుంది. ఇక ఆమెకి వారసత్వంగా కూడా కొంత ఆస్తి వచ్చిందట. మొత్తం కలిపి చూస్తే తమన్నా ఆస్తులు ప్రస్తుతం 220 కోట్లకు పైగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇదే కాకుండా ఆమె దగ్గర రెండు విలువైన వజ్రాలు కూడా ఉన్నాయట. వాటితోపాటు లగ్జరీ కార్లు, విల్లాస్, ఫ్లాట్స్ ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ లో తమన్నానే ఎక్కువ ఆస్తి కూడబెట్టుకుందన్న ప్రచారం జరుగుతోంది

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు