Project K to Kalki 2898 AD Promo out now: హాలీవుడ్ స్టేజ్ పైన టాలీవుడ్ సినిమా

Project K to Kalki 2898 AD Promo out now

గడిచిన పదేళ్లలో తెలుగు సినిమా ఖ్యాతి ఎంతవరకు విస్తరించిందో అందరం చూస్తూనే ఉన్నాం. ప్రాంతీయ భాష సినిమాలని చిన్న చూపు చూసిన తెలుగు సినిమాను ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీపడే స్థాయికి తీసుకువెళ్తున్నారు టాలీవుడ్ దర్శకులు. అయితే ఈ ఘనతకు పునాది వేసింది రాజమౌళి అయితే దానిని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి 2898AD సినిమా గ్లిమ్స్ విడుదల కార్యక్రమం కాలిఫోర్నియాలోని శాన్ డియాగో లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఈవెంట్ కు సంబందించిన ప్రోమోను యూట్యూబ్ లో విడుదల చేసింది మూవీ టీం. ప్రభాస్, రానా, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, స్వప్న దత్, ప్రియాంక దత్, కమల్ హాసన్ హాజరైన ఈ ఈవెంట్ అట్టహాసంగా జరిగినట్టు ప్రోమో ద్వారా తెలుస్తుంది.

తెలుగు సినిమాను కామిక్-కాన్ ఈవెంట్ లో ప్రజెంట్ చేయడం ఎంత సంతోషంగా ఉందంటూ ప్రియాంక చెప్పిన మాటలు ప్రోమోలో హైలెట్ అయ్యాయి. అశ్విని దత్ మాట్లాడుతూ తనకు ప్రభాస్, కమల్, అమితాబ్ లాంటి వాళ్ళతో వర్క్ చేయడానికి తన యాభై యేళ్ళ కెరీర్ లో ఇప్పుడు సాధ్యమైందంటూ ఆయన చెప్పాడు. కల్కి 2898 గ్లిమ్స్ వీడియోకు అక్కడి ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది.

- Advertisement -

గ్లిమ్స్ ప్లే చేయగా అరుపులు కేకలతో అక్కడి ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టారు. టీజర్ అయిపోగానే వన్స్ మోర్ అరుస్తూ కేరింతలు చేసారు. దీన్ని బట్టి చూస్తే తెలుగు సినిమాకు హాలీవుడ్ స్టేజ్ పైన ఎంతటి గౌరవం దక్కిందో తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ కు హీరోయిన్ దీపికా పదుకునే మాత్రం గైర్హాజరైంది. అలాగే అమితాబ్ బచ్చన్ వర్చువల్ గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. భారీ బడ్జెట్ తో మంచి అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గనక హిట్ అయితే తెలుగు సినిమా స్థాయి మరింతగా పెరుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ ఈవెంట్ ఫుల్ వీడియో మాత్రం అప్పుడు రిలీజ్ చేయబోతున్నారనేది ప్రోమోలో తెలియజేయగా పోవడం గమనార్హం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు