Silk Smitha Personal life: సిల్క్ స్మిత ఆ స్టార్ హీరోయిన్ ఇంట్లో పనిమనిషి అని తెలుసా..!

Silk Smitha Personal life

80 ల్లో నిషా కళ్ళతో తనదైన అందంతో సినీ ప్రియులను ఓ ఊపు ఊపిన సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. నిజానికి ఈ ముద్దుగుమ్మ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె అందం అనే చెప్పాలి. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి అనే గ్రామంలో జన్మించింది ఈ తార. ఈమెకు చిన్న వయసులోనే సినిమాల్లో నటించాలనే కోరిక పుట్టింది.

కానీ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్లాలి..? అన్నది మాత్రం ఆమెకు తెలియలేదు. ఇక సిల్క్ స్మితకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఆ తర్వాత అత్తింటి వేధింపులు తట్టుకోలేక తన పిన్ని గారి ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత తన పిన్నితో కలిసి మద్రాసులో అడుగు పెట్టింది. అక్కడ కొందరు ఇళ్లల్లో పనులు చేసేది. ఈ క్రమంలోనే తనకు బాగా తెలిసిన వారి ద్వారా అప్పటి స్టార్ హీరోయిన్ అపర్ణ ఇంట్లో పనిమనిషిగా చేరింది.

ఇక సిల్క్ స్మిత కి చిన్నప్పటినుండే డాన్స్ అంటే చాలా ఇష్టం. జీనత్ అమన్ లాంటి గొప్ప డాన్సర్ కావాలని కోరిక ఉండేది ఈ ముద్దుగుమ్మకి. ఈమె ఓ రోజు ఓ దర్శకుడి కంటపడడంతో సినిమా అవకాశాలను అందుకుంది. మొదట సైడ్ డాన్సర్ గా తన సినీ కెరీర్ నీ ప్రారంభించి.. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘ఒక మగాడు ఒక ఆడది’ సినిమా ద్వారా ఈమె తొలిసారిగా వెండితెరకు పరిచయం అయింది. ఇక ఐటమ్ సాంగ్స్ కి డాన్స్ చేయడం మొదలుపెట్టాక ఆమె కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ డం సంపాదించుకున్న సిల్క్.. ప్రేమలో మోసపోయింది. బ్రేకప్ జరగడంతో మద్యానికి బానిసై సినిమాలపై ఫోకస్ తగ్గించింది. ఆ తరువాత చాలాకాలం మానసిక సంఘర్షణకు గురైన ఆమె ఆత్మహత్య చేసుకుని ఈ లోకానికి దూరమైంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు