Suma Kanakala : ప్రమాదంలో సుమ కెరీర్.. అచ్చం సమంతా లాగే అరుదైన వ్యాధి ?

Suma Kanakala

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమ గురించి తెలియని టీవీ ప్రేక్షకులు ఉండరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు సుమ తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేరళకు చెందిన సుమ మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్.

ఎంత పెద్ద షో అయినా ఆమె ఏమాత్రం బెదరకుండా అనర్గళంగా మాట్లాడగలదు. సుమ తెలుగులో పాపులర్ యాంకర్ కాదు… టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఆమె హోస్ట్ చేయాల్సిందే. ఇదిలా ఉండగా, ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుందట సుమ. తాను కీలాయిడ్ టెండేన్స్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నానని, ఈ చర్మవ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఎన్నో బాధలు, కష్టాలు అనుభవిస్తున్నానని తెలిపింది.

అంతేకాకుండా ఈ సమస్య వల్ల ప్రతీసారి మేకప్ వేసుకున్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందని, తన కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి? ఎలా తీసేయాలి? వంటి విషయాలు కూడా తెలిసేది కాదని… అందుకే చర్మానికి ఈ డామేజ్ జరిగిందని పేర్కొంది. ఒకచోట గాయం అయితే అది పెద్దదిగా మారి చుట్టుపక్కలంతా వ్యాపించి మరింత పెద్ద గాయం అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు