Srinidhi Shetty: ఆ టాలీవుడ్ హీరోకు జోడిగా కెజియఫ్ బ్యూటీ

Srinidhi Shetty

కెజియఫ్ సినిమాలో తన గ్లామర్, నటనతో అందరిని ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి ని ఇన్నాళ్లకు ఒక క్రేజీ ఆఫర్ వరించింది. కెజియఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి కెజియఫ్2 సినిమా రిలీజ్ తరువాత నుంచి ఆమె చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. అందుకే కెజియఫ్2 సినిమా రిలీజైన చాలా రోజులు గడుస్తున్న ఆమెపెద్దగా సినిమాలేవీ చేయలేదు.

ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం చూస్తే శ్రీనిధి శెట్టి ఒక టాలీవుడ్ స్టార్ హీరో తో జత కట్టనుందట. అయితే ఆ హీరో ఎవరా అని అనుకుంటున్నారా.. నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలోని బాలకృష్ణ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక ఈ సినిమాలో కెజియఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ని ఫ్లాష్ బ్యాక్ వచ్చే హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ పూర్తి కొత్త లుక్ లో కనిపించనున్నాడట. ఇప్పటి వరకు బాలకృష్ణ చేసిన గత సినిమాలకు, బాబీ తో చేయబోయే సినిమాకు చాలా వరకు వైవిధ్యం ఉండటంతో మేకర్స్ హీరోయిన్స్ విషయంలో జాగ్రత్త గా ఉంటున్నారట. అందుకే మొదటి హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఫైనల్ చేశారట. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుందట. ఆ వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు