Siddharth : మరో హీరోయిన్ తో డేటింగ్ ?

తమిళ హీరో సిద్ధార్థ్ గురించి తెలియని వారుండరు. 43 ఏళ్ల వయసులో ఉన్నా, యంగ్ గానే కనిపిస్తాడు. దీంతో పాటు సినిమాల్లో లవర్ బాయ్ పాత్రలో కనిపించడంతో సిద్ధార్థ్ ను లవర్ బాయ్ అని పిలుస్తారు. ఈ హీరో ప్రస్తుతం సినిమాల్లో కంటే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల గురించి వరుసగా ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచాడు. పుష్ప కలెక్షన్లపై ఓ ట్వీట్ వేసి, బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహానికి బలైయ్యాడు. అలాగే టెన్నిస్ క్రీడాకారిణి సైనా నెహ్వల్ ను అవమానిస్తు ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టాడు. అప్పట్లో ఈ ట్వీట్ పై జాతీయ మహిళా కమిషన్ కూడా సిరీయస్ అయింది. సైబర్ క్రైం కింద కేసు నమోదు అయింది.

ఇలా వివాదాలతో వార్తల్లో నిలిచిన సిద్ధార్థ్, తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. సిద్ధార్థ్ తో నటించిన హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటాడని ఎప్పటో నుండి ఒక రూమర్ ఉండేది. కొంతమంది హీరోయిన్లతో కూడా డేటింగ్ చేశాడని వార్తలు వచ్చాయి. అందులో సమంత కూడా ఒకరు. తాజాగా సిద్ధార్థ్ మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని సమాచారం. సిద్ధార్థ్, శర్వానంద్ ఇద్దరు కలిసి మహా సముద్రం సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధార్థ్ కు జోడీగా అదితి రావు హైదరి నటించింది.

అయితే, ఈ ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారట. ఈ ప్రేమ జంట ముంబై వీధుల్లో షికార్లు కొడుతున్న సమయంలో వీళ్ల ఫోటోలు కెమెరా చేతికి చిక్కాయట. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి సిద్ధార్థ్ సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా లవర్ బాయ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా సిద్ధార్థ్ కు ఇప్పటికే పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ భార్య నుండి డైవర్స్ తీసుకుని సింగిల్ గా ఉంటున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు