Karthikeya 2 : వెనక్కి తగ్గినా పోటీ తప్పలేదు

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబోలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కిన విషయం తెలిసిందే. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సీక్వెల్ సినిమాలో శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ చేసే వైద్యుడి పాత్రలో నిఖిల్ కనిపించనున్నారు. కార్తికేయ 2 ముందుగా జూలై 22న రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ ఇదే డేట్ న అక్కినేని నాగ చైతన్య హీరోగా వస్తున్న థాంక్యూ సినిమా విడుదల కానుంది. దీనికి ప్రొడ్యూసర్ దిల్ రాజు. థాంక్యూ సినిమాకు ఇబ్బంది కాకుండా ఉండాలని కార్తికేయ 2 నిర్మాతలను వాయిదా కు ఒప్పించాడు. దీంతో జూలై 22 బరిలో నుండి నిఖిల్ తప్పకున్నాడు. దీని తరువాత ఆగస్టు 5 ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వినిపించాయి. దీంతో పాటు మరికొన్ని తేదీలను చిత్ర యూనిట్ పరిశీలించిందని టాక్. ఫైనల్ గా చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది. ఆగస్టు 12న కార్తికేయ 2 మల్టీ లాంగ్వేజ్ మూవీ రిలీజ్ కాబోతున్నట్టు వెల్లడించారు. దీంతో పాటు ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో హీరో నితిన్ ఒక పాముతో కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.

ఇక ఇదే డేట్ న నితిన్ హీరోగా వస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రిలీజ్ కానుంది. దీంతో నిఖిల్ కు మరోసారి పోటీ తప్పడం లేదు. అప్పుడు నాగ చైతన్యతో పోటీ ఉండేది. వాయిదా తర్వాత నితిన్ తో పోటీ పడుతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలకు దిల్ రాజు తో సంబంధం ఉంది. థాంక్యూ కు దిల్ రాజు నిర్మాతగా ఉండగా, మాచర్ల నియోజక వర్గం సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు