Nithya Menen : ‘పెళ్లి వార్తల్లో నిజం లేదు’

సినిమా ఇండస్ట్రీలో పుకార్లు రావడం సహజం. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తాయి. అందులో కొన్ని నిజాలు ఉంటాయి. మరికొన్ని పుకార్లు అని చివరికి తెలిసిపోతుంది. తాజా గా టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ విషయంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. నిత్యా మీనన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని, మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

వీరిద్దరూ చిత్ర పరిశ్రమ లోకి రాకముందే ప్రేమించుకున్నారని కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చింది. ఇద్దరి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని మరి కొన్ని వెబ్ సైట్లు రాశాయి. అయితే తాజా గా నిత్యా మీనన్ పెళ్లి వార్తలపై స్పందించింది. తన పెళ్లి పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. తన పెళ్లి గురించి ఏదైనా ఉంటే, తానే స్వయం గా అందరికీ చెబుతానని వెల్లడించింది. దీంతో మంగళవారం నుండి వస్తున్న వార్తలకు చెక్ పడింది.

హీరోయిన్ల పెళ్లిల పై పుకార్లు రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. వయసు దాటిపోతున్న హీరోయిన్లు పెళ్లి గురించి ఎక్కుడా ప్రస్తావించకపోవడంతో ఇలాంటి వార్తలు వస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు