Shruti Haasan : డిమాండ్ పెరిగింది

శ్రుతి హాసన్ ప్రస్తుతం కోలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు. సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్. అగ్ర హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ, కొన్ని రోజుల్లోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో సౌత్ లోనే అగ్ర కథానాయకిగా ఎదిగింది. అలాగే శ్రుతి నటించిన సినిమాలు వరుసగా హిట్ అవుతుండటంతో క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది. అదే విధంగా డిమాండ్ ఉంది.

36 ఏళ్ల ఈ భామకు ఇప్పుడు కూడా మంచి డిమాండ్ ఉంది. వరుసగా అగ్ర హీరోల సరసన ఛాన్స్ లను కొట్టేస్తుంది. గతేడాది పిట్ట కథలు సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో నటించింది. ఈ ఏడాది నందమూరి నటసింహం బాలయ్య తో NBK 107, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూడు చిత్రాలు కూడా భారీ అంచనాలతో రాబోతున్నాయి.

ఇది ఇలా ఉండగా, చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ ఉన్న శ్రుతి ప్రస్తుతం రెమ్యునరేషన్ ను భారీగా పెంచనుందని సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు రూ. 1 కోటి నుండి రూ. 1.50 కోట్లు వరకు తీసుకున్న శ్రుతి హాసన్, ప్రస్తుతం ఒక్కో సినిమా కు రూ. 2.5 కోట్ల నుండి రూ. 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ స్టార్ హీరోయిన్ నటించిన సినిమాలు కూడా మంచి విజయాలు నమోదు అవుతున్నాయి. దీంతో నిర్మాతలు కూడా శ్రుతి డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ కు ఒకే చెబుతున్నారని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు