God Father Teaser : వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్

మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తనకెక్కిన చిత్రం “గాడ్ ఫాదర్”. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్బి చౌదరి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అనుచరిడి పాత్రలో సునీల్ నటిస్తుండగా, ఒక కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కనిపించబోతున్నారు. ఓ మాఫియా డాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 5 ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. టీజర్ ప్రారంభంలో.. “20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో తెలియదు.. సడన్ గా తిరిగి వచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు”. అంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ తెప్పించింది. టీజర్ చివర్లో సల్మాన్ ఖాన్ ను ఉద్దేశిస్తూ.. ” వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్” అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.

కొందరు రాజకీయ నాయకులను గాడ్ ఫాదర్ ఎలా నిలువరించాడు, వాళ్లను ఎలా అంతమందించాడు అనేది కథగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు