NBK108 : కెరీర్ లో తొలిసారి

అఖండ చిత్రంతో నందమూరి నట సింహం బాలకృష్ణ ఎంత పెద్ద హిట్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ విజయంగా నిలిచింది. దానీ తర్వాత బాలయ్య వరుసగా సినిమాలు చేస్తున్నారు. గోపీచంద్ మలినేని తో చేస్తున్న NBK 107 షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK108 ప్రీ పొడక్షన్ పనులను జరుపుకుంటుంది. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబో సినిమా గురించి నందమూరి అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రానికి అనిల్ రావిపూడి బ్రో ఐ డెంట్ కేర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపిస్తుందని సమాచారం అందుతుంది. మిడిల్ ఏజ్ లో బాలయ్య నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఎంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బాలయ్యతో అనిల్ రావిపూడి చేయబోతున్న ఈ సినిమాకు రూ. 75 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఇది బాలయ్య, అనిల్ రావిపూడి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. కథానుసారంగా సినిమాకు ఎక్కవ బడ్జెట్ ఉంటుందట. కాగా ఈ చిత్రం ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది చివరలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు