గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడతూ వచ్చిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్దంగా ఉంది.
అయితే ఇటీవల మెగా స్టార్ ఆచార్య మూవీ అనూహ్యంగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే మెగాస్టార్ కెరీర్ లోనే బిగేస్ట్ డిజాస్టార్ అయ్యేలా.. కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా వల్ల నిర్మాతతో సహా డిస్ట్రిబ్యూటర్స్ తీవ్ర నష్టాలో మునిగిపోయారు. అయితే ఈ ఆచార్య భయం.. మహేష్ సర్కారు వారి పాటకు పట్టుకుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
Read More: NBK109: బాలయ్య సినిమా కోసం లైన్లో ఇద్దరు భామలు?
ఆచార్య సినిమా అనుభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రీమియర్స్ షో లతోనే బ్రేక్ ఈవెన్ ను సంపాదించాలని డిస్ట్రిబ్యూటర్స్ ధ్యేయంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. విడుదల తర్వాత నెగెటివ్ టాక్ వచ్చినా.. నష్టాల్లో ఉండకుండా ఒక రకమైన సేఫ్ గేమ్ ని ప్లాన్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సర్కారు వారి పాటకు ప్రీమియర్ షోలతో బ్రేక్ ఈవెన్ రావడం ప్రస్తుతం సమయలో కష్టమేమీ కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు టికెట్ల రెట్లు భారీగానే పెంచుతున్నారు. అలాగే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పొస్టర్స్, సాంగ్స్, ట్రైలర్.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఈ అంచనాలను క్యాష్ చేసుకుని ప్రీమియర్ షోలతోనే లాభాల బాట పట్టాలని ప్లాన్ వేస్తున్నారు.
Read More: ఆచార్య : నాగార్జున పరిస్థితే రిపీట్..??
అయితే సర్కారు వారి ముందు జాగ్రత్త ఎంత వరకు సక్సస్ అవుతుందో వేచి చూడాలి మరి.
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...