అనిల్ ఇక బయటకి రావా.?

అనిల్ రావిపూడి
రైటర్ గా కెరియర్ మొదలుపెట్టి దర్శకుడిగా ఎదిగి సూపర్ స్టార్ మహేష్ బాబు తో “సరిలేరు నీకెవ్వరు” అనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పటాస్ సినిమా నుంచి మొదలుపెడితే ఆయన చేసిన ప్రతి సినిమా మంచిపేరునే తీసుకుని వచ్చింది. కామెడీ రాయడంలో అనిల్ రావిపూడిది సెపరేట్ స్టైల్. కానీ అనిల్ రావిపూడి నుంచి కామెడీ మాత్రమే కోరుకోవట్లేదు సినీ ప్రేమికులు.

అనిల్ ప్రస్తుతం నటసింహం బాలయ్యబాబుతో సినిమాని చేయనున్నారు. బాలయ్య బాబు గురించి ఆయన రౌద్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ సినిమా తరువాత బాలయ్య బాబుతో సినిమా అంటే కొంచెం టెన్షన్ గానే ఉంటుంది దర్శకులకి.అఖండ సినిమాతో బోయపాటి ఒక మోత మోగించారు.
అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా తరువాత అనిల్ తో సినిమా పట్టాలెక్కుతోంది.

అనిల్ చేసిన F3 సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది, అప్పట్లో సంక్రాంతికి వచ్చిన f2 సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి తరలివచ్చి ఆ సినిమా కలక్షన్స్ అమాంతం పెంచేశారు. ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కింది కానీ యూత్ కి ఏమాత్రం ఎక్కలేదు.ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తుంది f3 సినిమా.
ఇది ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే రిలీజ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే అనిల్ బాలయ్యతో చేయబోయే సినిమా తరువాత F4 సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత అయినా F4 ఫ్లేవర్ విడిచి పెట్టి వేరే సినిమాలు చేస్తాడో లేదంటే రియాలిటీ షోస్ లా సీజన్స్ కంటిన్యూ చేస్తాడో మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు