“మ‌నోహ‌రి” కి ఫుల్ డిమాండ్.. ఒక్క పాట‌కే..!

టాలీవుడ్ సంచ‌ల‌నం బాహుబ‌లి సినిమాలో మ‌నోహ‌రి… అంటూ స్టెప్స్ వేసి కుర్ర‌కారుకు నిద్ర లేకుండా.. చేసిన నోరా ఫ‌తేషీ గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. ఎన్టీఆర్ టెంప‌ర్ లో ఇట్టాగే రెచ్చిపోదాం.. అనే సాంగ్ తో తెలుగు తెర పైకి వ‌చ్చిన ఈ కెన‌డా భామ‌.. కిక్2, షేర్, లోఫ‌ర్ తో పాటు ఊపిరి సినిమాల్లోనూ ఐటెం సాంగ్స్ చేసింది. అలాగే బాలీవుడ్ సినిమాల్లో ప‌లు పాత్ర‌లు కూడా చేసింది.

అయితే తాజా గా ఈ కెన‌డా అమ్మ‌డుకి బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడికల్‌ యాక్షన్ జోన‌ర్ లో ప‌వ‌న్ హరి హ‌ర వీర మ‌ల్లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ప‌వ‌ర్ స్టార్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుంది. కాగ ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే 70 శాతం పూర్తి చేసుకుంది. అతి త్వ‌ర‌లో షూటింగ్ కు గుమ్మ‌డి కాయ కొట్టి ఈ ఏడాది ద‌స‌ర‌కు ఈ మూవీ రిలీజ్ చేయ‌డాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

- Advertisement -

కాగ ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం నోరా ఫ‌తేషీ ని పవ‌న్ క‌ళ్యాణ్ ఎంపిక చేశార‌ట‌. దీని కోసం ఏకంగా రూ. 45 ల‌క్ష‌ల రెమ్యూన‌రేష‌న్ ను కూడా ఇస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్. ఈ కెన‌డా భామ.. హ‌రి హ‌ర వీర మ‌ల్లులో స్పెష‌ల్ సాంగ్ తో పాటు ఓ కీల‌క పాత్ర‌లో కూడా క‌నిపించ‌బోతుంద‌ని విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం. అయితే నోరా ఫతేషీ ఇప్పటి వ‌ర‌కు తెలుగులో కేవ‌లం ఐటెం సాంగ్స్ ల్లోనే క‌నిపించింది. కాని తొలి సారి సినిమాను మ‌లుపు తిప్పే పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.

స్పెష‌ల్ సాంగ్స్ తో కుర్ర‌కారు గుండాల్లో పాగ వేసిన ఈ మ‌నోహ‌రి.. ఇప్పుడు న‌ట‌న‌తో ఎంత వ‌రకు ఆక‌ట్టుకుంటుందో చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు