వ‌న‌వాసం చేశావా ఏంటీ..?

ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా.. గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. టాలీవుడ్ తో పాటు ఇత‌ర భాషాల్లో కూడా స్టార్ హీరోల సినిమాల‌కు డాన్స్ కంపోస్ చేసిన ప్ర‌భు దేవా.. దేశంలోనే ది బెస్ట్ డాన్స‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కంపోజ్ చేసిన డ్యాన్స్ లు వేరే లేవెల్ లో ఉంటాయి. తెలుగులో శంక‌ర్ దాదా జిందాబాద్, పౌర్ణ‌మి తో పాటు ప‌లు సినిమాలకు కొరియాగ్రాఫ‌ర్ గా చేసి సినీ ల‌వ‌ర్స్ తో ఈల‌లు వేయించారు.

అయితే ఈ ఇండియ‌న్ మైఖేల్ జాక్స్ చాలా ఏళ్ల‌ త‌ర్వాత కొరియోగ్రాఫ‌ర్ గా టాలీవుడ్ రీ – ఎంట్రీ ఇస్తున్నాడు. యాక్ట‌ర్ గా ప‌లు సినిమాల్లో క‌నిపించినా.. దాదాపు 14 ఏళ్ల పాటు టాలీవుడ లో కొరియాగ్రాఫ‌ర్ గా క‌నిపించ‌లేదు. మ‌ధ్య‌లో ధోని అన్ టోల్డ్ స్టోరీ మూవీకి డ్యాన్స్ కంపోజ్ చేసినా.. అది తెలుగు డ‌బ్బింగ్ మూవీ అని తెలిసిందే. అయితే ఇప్పుడు ప్ర‌భు దేవా.. కొరియోగ్రాఫ‌ర్ గా చేయ‌డానికి వ‌రుస‌గా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు.

రెండు రోజుల్లో రెండు తెలుగు సినిమాల‌ను లైన్ లో పెట్టాడు. నిన్న మెగా స్టార్ గాడ్ ఫాదర్ మూవీకి సైన్ చేయ‌గా.. నేడు మంచు విష్ణు గాలి నాగేశ్వ‌ర్ మూవీకి ఓకే చెప్పాడు. దాదాపు 14 ఏళ్ల త‌ర్వాత టాలీవుడ్ కు వ‌చ్చి వరుస‌గా సినిమాలు చేయ‌డం పై.. ఇన్నాళ్లు వ‌న‌వాసం చేశావా.. ప్ర‌భు అంటూ నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. కాగ ప్ర‌భుదేవా వ‌న‌వాసం త‌ర్వాత‌.. టాలీవుడ్ లో నిల‌క‌డ‌గా రాణిస్తాడా..? లేదా.. మ‌ళ్లీ బాలీవుడ్, కోలీవుడ్ కు వెళ్లిపోతాడా..? అనేది చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు