విశ్వక్ సేన్ తక్కువ కాలంలోనే ఎక్కువ పేరును సాధించుకున్న యంగ్ & ఎనర్జిటిక్ హీరో. పేరును మాత్రమే కాదు చాలా వివాదాలను కూడా చుట్టుకున్నాడు. ఆయన నటించిన ” అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా మే 6 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనేక కొత్త విషయాలను మీడియాతో పంచుకుంటున్నారు ఈ మాస్ కా దాస్.
ఈ సినిమా తరువాత ధమ్కీ అనే సినిమాని చేయనున్నారు విశ్వక్ సేన్. ఈ ధమ్కీ అనే కథను ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. జబర్దస్త్ తో కెరియర్ మొదలుపెట్టిన ప్రసన్న , పాగల్ సినిమా దర్శకుడు నరేష్ , కమెడియన్ మహేష్ ఆచంట వీళ్లంతా మంచి ఫ్రెండ్స్ అనే విషయం చాలామందికి తెలిసిందే. ఆ స్నేహబంధం తోనే నరేష్ దర్శకుడిగా ,విశ్వక్ హీరోగా కథను రెడీ చేసాడు ప్రసన్న.
ఈ మధ్యనే ఈ సినిమా ముహూర్తపు పూజ కూడా జరిగింది . కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడిగా నరేష్ ను తొలగించారు విశ్వక్, దీనికి కారణంగా చెప్పుకొస్తూ తనకు కావాల్సిన ఎలిమెంట్స్ ను ఆ స్క్రిప్ట్ లో యాడ్ చేసినట్లు ఒక దర్శకుడు ఉండగానే ఎక్కువ మార్పులు చేస్తే ఆయన బాధ పడతాడు కాబట్టి నరేష్ కి ఇంకో సినిమా చేస్తాను అని మాట ఇచ్చి తనని తొలగించినట్లు చెప్పుకొచ్చారు విశ్వక్.
ఈ సినిమాకి స్వయంగా విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్నారు,
ఇదివరకే “ఫలక్ నామా దాస్” సినిమాతో తనలోని దర్శకత్వ ప్రతిభను కనబర్చిన విశ్వక్ మరోసారి మెగాఫోన్ పట్టనున్నాడు. ఈ సందర్భలోనే “ఫలక్ నామా దాస్” సీక్వెల్ ఉండబోతుందని, దానికి “మాస్ కా దాస్” అని టైటిల్ పెట్టి తీయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.