ఏంటి విజ‌య్.. అప్పుడేనా…?

మాస్ట‌ర్ మాస్ హిట్ త‌ర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి నెల్స‌న్ డైరెక్ష‌న్ లో బీస్ట్ మూవీ చేసిన విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ భారీ అంచ‌నాల‌తో గ‌త నెల 13న థియేట‌ర్స్ ల‌లో విడుద‌ల అయింది. అంచ‌నాల‌ను అందుకోలేకపోయిన బీస్ట్.. బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా ప‌డింది. దీని త‌ర్వాతే.. పాన్ ఇండియా సంచ‌ల‌నం కేజీఎఫ్-2 కూడా రిలీజ్ కావ‌డంతో బీస్ట్ మ‌రింత‌ తేలిపోయింది.

థియేట‌ర్స్ లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న విజ‌య్ బీస్ట్.. ఓటీటీలో రిలీజ్ కావ‌డానికి సిద్ధం అవుతుంది. బీస్ట్.. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తో పాటు స‌న్ నెక్ట్స్ లో ఈ నెల 11 నుంచి ప్ర‌సారం కానున్న‌ట్టు చిత్ర బృందం అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. కాగ టెర్ర‌రిస్ట్ ల నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో రా ఏజెంట్ గా విజ‌య్ క‌నిపించాడు. థియేట‌ర్స్ లో ఆక‌ట్టుకోలేని ఈ మూవీ ఓటీటీలో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుంతో చూడాలి మ‌రి.

కాగ నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీని స‌న్ టీవీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ నిర్మించాడు. అలాగే ఈ మూవీలో విజ‌య్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించింది. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు