రౌడీ హీరో క్రేజీ అప్డేట్

పూరి జగన్నాధ్
గన్ నుండి బుల్లెట్స్ బయటకు వచ్చినట్లు
ఈయన పెన్ నుండి నుండి డైలాగ్స్ వస్తాయి .
టక టక కథ రాసేసి చకచకా సినిమా తీసేయడం ఈయన స్టైల్.
కానీ ఈ మధ్య ఆ స్పీడ్ కాస్తా తగ్గింది, ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత ఆయన నుంచి ఇప్పటివరకు సినిమా బయటకు రాలేదు.
పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమాను చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

విజయదేవరకొండ అంటే అర్జున్ రెడ్డి ముందు అర్జున్ రెడ్డి తరువాత అని చెప్పొచ్చు. అప్పటి వరకు నువ్విలా, లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ , ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమాలలో కనిపించిన విజయ్ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక రేంజ్ కి వెళ్ళిపోయాడు.

ఇప్పుడు ఆయన డేట్స్ కోసం వెయిట్ చేసే నిర్మాతలు ఉన్నారు ఇండస్ట్రీ లో. ప్రస్తుతం చేస్తున్న లైగర్ సినిమా తరువాత మళ్ళి పూరితోనే “జనగణమన” సినిమా చేయనున్నాడు విజయ్. వాస్తవానికి ఈ సినిమాను పూరి మహేష్ బాబుతో చేయాలి కానీ వారి మధ్య జరిగిన చిన్న చిన్న మనస్పర్ధాలు వలన ఆ ప్రాజెక్ట్ విజయ్ కు సెట్ అయింది. విజయ్ రీసెంట్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని మొదలుపెట్టాడు. షూటింగ్ పూర్తిచేసుకున్న లైగర్ ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 9 న రిలీజ్ చేయనున్నట్లు ఆఫీసియల్ అనౌన్సమెంట్ ఇచ్చింది మూవీ టీం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు