Samantha : అక్కినేని ఇంట్లో ఇంకా సమంత గుర్తులు ?

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్ హీరోయిన్ సమంత ఉంటుంది. ఆమె చేసే సినిమాలు కూడా అద్భుతంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే సినిమా రెమ్యూనరేషన్ కూడా వసూలు చేస్తుంది హీరోయిన్ సమంత. గత 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోంది హీరోయిన్ సమంత.

ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది సమంత. తమిళ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసిన తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఎంట్రీ సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది సమంత. అంతేకాదు ఏం మాయ చేసావే సినిమా సమయంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఇద్దరు ప్రేమలో పడిపోయారు. ఈ సినిమా షూటింగ్ నడుస్తున్న క్రమంలోనే షికార్లు కొట్టారు.

దాదాపు 5 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో ప్రేమ విషయం చెప్పారు. ఇంకేముంది అక్కినేని కుటుంబం అలాగే సమంత ( Samantha ) కుటుంబం వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత వివాహం జరిగింది. పెద్దల సమక్షంలోనే గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని అనువార్య కారణాలవల్ల 2021 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడిపోయారు.

- Advertisement -

దీంతో అప్పటినుంచి హీరోయిన్ సమంత మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు. ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్ సమంత గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంతకు సంబంధించిన గుర్తులను ఇంకా అక్కినేని ఇంట్లోనే ఉంచుకున్నారట నాగచైతన్య.

నాగచైతన్య తో పెళ్లి అయిన తర్వాత అక్కినేని కుటుంబంతో కలిసి హీరోయిన్ సమంత ఒక ఫోటో దిగారట. ఆ ఫోటోను అక్కినేని ఇంటి హాల్లో పెట్టారట. అయితే ఆ ఫోటోను విడాకుల తర్వాత కూడా ఎవరు  తీసేయలేదట. అందులో సమంత ఉన్న కూడా పక్కకు పెట్టలేదట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని నాగచైతన్యకు ఇంకా సమంత అంటే ప్రేమ ఉందని అందుకే ఇలా చేయలేదని కొంతమంది అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు