Naga Chaitanya : ఎన్ని కోట్లు ఇచ్చినా నాగ చైతన్యతో ఆ పని చేయను అంటున్న హీరోయిన్..?

Naga Chaitanya : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది కష్టపడి పైకి వస్తే మరి కొంత మంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. మరికొంతమంది తమ టాలెంటు ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో పాతుకుపోయారు. అయితే తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి అక్కినేని నాగచైతన్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. జోష్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనంతరం… ఏం మాయ చేసావే సినిమా చేశాడు. ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమా సమయంలోనే హీరోయిన్ సమంత ప్రేమలో పడిపోయాడు అక్కినేని నాగచైతన్య. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) మరియు సమంత ప్రేమించుకోవడం ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం అనంతరం విడిపోవడం కూడా జరిగిపోయింది.

ఇక ప్రస్తుతం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అక్కినేని నాగచైతన్య… బాలీవుడ్ అలాగే వెబ్ సిరీస్, ఇలా ఎక్కడ ఛాన్సులు వస్తే అక్కడ చేసేస్తున్నాడు సినిమాలు. ఇది ఇలా ఉండగా తాజాగా అక్కినేని నాగచైతన్యకు చేదు అనుభవం ఎదురయింది. ఎన్ని డబ్బులు ఇచ్చిన అక్కినేని నాగచైతన్యతో సినిమా చేయనంటూ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ స్పష్టం చేసిందట. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె తెలుగులో హీరోయిన్గా తక్కువ చేసినప్పటికీ… సైడ్ పాత్రల్లో అదరగొట్టింది. క్రాక్, వీర సింహారెడ్డి, యశోద లాంటి సినిమాలలో విలన్ గా నటించింది వరలక్ష్మి.

- Advertisement -

అయితే ఇటీవల అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు వరలక్ష్మికి ఆఫర్ వచ్చిందట. దానికోసం కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తారని ఆఫర్ కూడా ఇచ్చారట. కానీ ఎన్ని కోట్లు ఇచ్చిన నాగచైతన్యతో సినిమా చేయనని స్పష్టం చేసిందట వరలక్ష్మి. అయితే దీనికి కారణం హీరోయిన్ సమంత అని తెలుస్తోంది. వరలక్ష్మి మరియు సమంత మంచి ఫ్రెండ్స్ అట. అలాంటి సమంతకు ఎలాంటి ఆధారం లేకుండా నాగచైతన్య చేశాడని వరలక్ష్మి ఫీలింగ్. అందుకే అక్కినేని నాగచైతన్య సినిమాను రిజెక్ట్ చేసిందట వరలక్ష్మి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు