Denial Balaji : గుండె పోటుతో రామ్ చరణ్ విలన్ మృతి

Denial Balaji : కోలీవుడ్ నటులు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. అలా కోలీవుడ్ లో నటుడుగా మంచి పేరు సంపాదించిన డేనియల్ బాలాజీ.. ఎక్కువగా విలన్ రోల్స్ లోనే నటిస్తూ ఉంటారు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను నిర్మించిన డేనియల్ బాలాజీకి నిన్న రాత్రి గుండెపోటు రావడంతో చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చేర్పించారట.. కానీ అప్పటికే పరిస్థితి చేయి జారిపోవడంతో అతను మరణించినట్టుగా తెలుస్తోంది..ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా తెలియజేస్తూ గుండెపోటుతో మరణించారు అంటూ స్పష్టం చేశారు. ఈ వార్త విని తమిళ సినీ పరిశ్రమ, అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.. 48 ఏళ్ల వయసు ఉన్న బాలాజీ ఇలా హఠాత్తుగా మరణించడంతో ఒకసారిగా తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దీంతో సినీ ప్రముఖులు, నెటిజెన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా ఈ నటుడుకి నివాళులు అర్పిస్తున్నారు.ఈరోజు డేనియల్ బాలాజీ నివాసంలోనే భౌతికానికి అంత్యక్రియలు చేస్తారని సమాచారం.

డేనియల్ బాలాజీ జీవితం..

డేనియల్ బాలాజీ ( Denial Balaji ) తండ్రి తెలుగువారు కాగా తల్లి తమిళులు .. డైరెక్టర్ కావాలనే కోరికతో ఫిలిం మేకింగ్ కోర్స్ నేర్చుకున్న బాలాజీ చివరికి నటుడుగా స్థిరపడిపోయారు. ముఖ్యంగా కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన గౌతమ్ మీనన్ తో డేనియల్ బాలాజీ కి మంచి స్నేహబంధం ఉన్నదట. గద్దల కొండ గణేష్ చిత్రంలో నటించిన నటుడు అథర్వ మురళి స్వయాన డేనియల్ కు మేనల్లుడు అవుతారట..

డేనియల్ బాలాజీ సినీ జీవితం..

బాలాజీ మొదట బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి ధారావాహిక చితి అనే సీరియల్ లో నటించారు..అక్కడ అతను డేనియల్ అనే పాత్రను పోషించి ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత పిన్ని పేరుతో ఇదే సీరియల్ తెలుగులో డబ్బింగ్ అయి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ సీరియల్ హిట్ అవడంతో అతని రెండవ సీరియల్ అలైగల్ లో, విజయన్ వంటి ధారవాహికలలో తన పాత్రకు తానే దర్శకత్వం వహించుకొని మంచి పేరు సంపాదించుకున్నారు డేనియల్ బాలాజీ. డేనియల్ బాలాజీ తమిళ్, మలయాళం, కన్నడ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు.సౌత్ ఇండియాలోనే అన్ని భాషలలో కలిపి సుమారుగా 50 కి పైగా చిత్రాలలో నటించారు డేనియల్ బాలాజీ.. ముఖ్యంగా తెలుగులో సాంబ, చిరుత ,ఘర్షణ, సాహసం వంటి తదితర చిత్రాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.. కమలహాసన్ నటించిన మరుదనాయగం అనే చిత్రంలో కూడా నటించారు.. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు