Tillu Suqare – Family Star : 24 రోజుల్లో 13 హాలిడేస్… టిల్లుకు, ఫ్యామిలీ స్టార్ కు కావాల్సింది ఇదొక్కటే

Tillu Suqare – Family Star : సంక్రాంతి తర్వాత చల్లబడిపోయిన బాక్స్ ఆఫీస్ ను షేక్ చెయ్యడానికి ఈ సమ్మర్ లో రెండు సినిమాలు రెడీ అయ్యాయి. బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లుకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ ఒకటి, రెండవది ఫ్యామిలీ స్టార్. ఈ రెండు సినిమాలకు కూడా వరుస హాలిడేస్ కలిసి రాబోతున్నాయి. కానీ హాలిడేస్ తో పని లేకుండా వీరిద్దరికీ కావాల్సిందల్లా ఒక్కటే. ఆ ఒక్కటి ఏంటి? సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ లకు కలిసి రాబోతున్న ఆ హాలిడేస్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

24 రోజుల్లో 13 హాలిడేస్… ఇది మామూలు ప్లానింగ్ కాదు…

టిల్లు స్క్వేర్ మూవీ మార్చ్ 29న అంటే ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సిద్దు, అను కెమిస్ట్రీ ఈ మూవీకి హైలెట్ గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అనుపమ టిల్లు స్క్వేర్ మూవీలో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ రెండు సినిమాలకు కలిసి రాబోయే హాలిడేస్ గురించి మాట్లాడుకుంటే… నెక్స్ట్ రానున్న మూడు వారాలు పండగలే పండగలు. గుడ్ ఫ్రైడే, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి పండగలు కలిసి రాబోతున్నాయి.

కంప్లీట్ హాలిడేస్ లిస్ట్…

– 29th మార్చ్- గుడ్ ఫ్రైడే
– 30th మార్చ్ – వీకెండ్
– 31st మార్చ్ – వీకెండ్
– 05th ఏప్రిల్ – బాబు జగ్జీవన్ రామ్ జయంతి
– 06th ఏప్రిల్ – వీకెండ్
– 07th ఏప్రిల్ – వీకెండ్
– 09th ఏప్రిల్ – ఉగాది
– 10th ఏప్రిల్ – రంజాన్
– 13th ఏప్రిల్ – వీకెండ్
– 14th ఏప్రిల్ – వీకెండ్
– 17th ఏప్రిల్ – శ్రీరామ నవమి
– 20th ఏప్రిల్ – వీకెండ్
– 21st ఏప్రిల్ – వీకెండ్

- Advertisement -

ఆ తర్వాత నుంచి సమ్మర్ హాలిడేస్ కంటిన్యూ అవుతాయి.

టిల్లుకు, ఫ్యామిలీ స్టార్ కు కావలసినదల్లా అదొక్కటే… రెండు సినిమాలకు  ( Tillu Suqare – Family Star ) కూడా ఇన్ని హాలిడేస్ కలిసి రావడం అనేది లక్ అనే చెప్పొచ్చు. ఇలాంటి అద్భుతమైన సమయంలో అటు టిల్లు స్క్వేర్, ఇటు ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ టాక్ వస్తే చాలు. కలెక్షన్ పరంగా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులపడం ఖాయం. ఈరోజు థియేటర్లోకి వచ్చిన టిల్లు ఇప్పటికే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నాడు. ఇక గత కొంతకాలంగా హిట్ అనే మాటకు దూరమైన విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ మూవీ టాక్ అనేది కీలకంగా మారనుంది. ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ టాక్ వస్తే విజయ్ దేవరకొండ ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పటికే టిల్లు స్క్వేర్ కు టాక్ విషయంలో కూడా లక్ బాగానే కలిసి వచ్చింది. మరి ఫ్యామిలీ స్టార్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇక వీరిద్దరూ ఎదుర్కోవాల్సిన మరో గండం ఐపిఎల్. ఫైనల్ మ్యాచ్ మే 26న జరగబోతోంది. ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాలపై ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు