Venkatesh : కనిపించరు కానీ ముదురే… అలా చేసి ఇంత కూడబెట్టారా..?

Venkatesh : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించిన హీరోలలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు . కుటుంబ ప్రేక్షకులలో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఏర్పడిన హీరోగా పేరు సంపాదించారు. ఇప్పటికే 80 కు పైగా సినిమాలలో నటించిన వెంకటేష్ ఇప్పటికి యంగ్ హీరోలకు దీటుగా తన సినిమాలను తీస్తూ.. మరోవైపు మల్టీ స్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.. అప్పుడప్పుడు డిఫరెంట్ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తూ ఉంటారు హీరో వెంకటేష్.

వెంకటేష్ ఆస్తిపాస్తులు..

ఇకపోతే వెంకటేష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 36 ఏళ్లు అవుతున్నా..వెంకటేష్ ( Venkatesh ) ఆస్తి విలువ ఎంత ఉంటుందని అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు.వెంకటేష్ హైదరాబాదులో ఇంద్ర భవనం లాంటి ఒక ఇల్లు మరొకవైపు సినిమాల నుంచి సంపాదించిన డబ్బు.. ఇలా మొత్తం ఆస్తి కలుపుకొని 2500 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు వెంకటేష్ కు తన తండ్రి నుంచి కూడా ఆస్తులు ఇంకా చాలానే వచ్చాయని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ లో అత్యధిక ధనవంతుల లిస్ట్ లో కూడా వెంకటేష్ పేరు చేరింది. మొత్తానికైతే సినిమాల ద్వారా అటు బిజినెస్ల ద్వారా భారీగా సంపాదించారు వెంకటేష్..

వెంకటేష్ చిత్రాలు..

ఇటీవల కాలంలో వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం-2 వంటి చిత్రాలకు మంచి రెస్పాన్స్ లభించింది.. ఈ రెండు చిత్రాలు కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలకు సురేష్ బాబు అమ్మినట్టుగా తెలుస్తోంది.. అలాగే F-3 తర్వాత నటించిన సైంధవ్ సినిమా కూడా విడుదలై ఫ్లాప్ గా మిగిలింది. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమాలతో ప్రేక్షకులను మాయ చేస్తున్న వెంకటేష్.. రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కెరియర్ మొదటి నుంచి ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న వెంకటేష్ ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తూ.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటారు.

- Advertisement -

సక్సెస్ అయిన ఆ తరహా మొదటి హీరో ఈయనే..

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల తనయులకు మంచి ఫ్యూచర్ ఉంటుంది.. కానీ డైరెక్టర్ లు, నిర్మాతల వారసులు ఇండస్ట్రీలో నిలబడడం అంటే అది చాలా తక్కువ సందర్భం అని కూడా చెప్పవచ్చు.. ఈ జాబితాలో వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటారనడం లో సందేహం లేదు.. నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో వెంకటేష్ సక్సెస్ అందుకోవడం జరిగింది. వెంకటేష్ కెరియర్ లో 80 శాతం వరకు సక్సెస్ రేటింగ్ ఎక్కువగా ఉన్నది.. అంతేకాకుండా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ సినిమాలు కూడా ఈయనతోనే మొదలవుతాయి..

అనుకోకుండా హీరో అయిన వెంకీ..

వాస్తవానికి వెంకటేష్ హీరో కావాలనుకోలేదట..ఒక బిజినెస్ మాన్ అవ్వాలనుకున్నారట. కానీ ఆయన తొలి సినిమా కలియుగ పాండవులు సినిమా విషయంలో ఒక సంఘటన జరిగింది.. రాఘవేంద్రరావు , కృష్ణ కాంబినేషన్లో రావాల్సిన ఈ చిత్రం వెంకటేష్ వద్దకు రావడంతో.. బిజినెస్ మొదలుపెట్టిన వెంకటేష్ తన వద్దకు వచ్చిన సినిమాని కాదనకుండా.. తండ్రి కోరిక మేరకు నటించి.. హీరోగా సక్సెస్ అయ్యారు.. అంతేకాదు మొదటి సినిమాతోనే అవార్డు అందుకున్నారు.. టాలీవుడ్లో అత్యధికంగా నంది అవార్డులు అందుకున్న హీరోగా కూడా పేరు పొందారు. ఇకపోతే వెంకటేష్ ఆస్తిపాస్తులు తెలిసి పైకి కనిపించరు కానీ బాగానే కూడా పెట్టారంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు