Vijay deverakonda : ప్రేమ పెళ్లే కావాలి… ఎట్టకేలకు ఒప్పుకున్నారుగా..!

Vijay deverakonda : టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకున్న వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు.. తనకంటూ రౌడీ హీరో అంటూ అనే పేరును కూడా సంపాదించుకున్నారు.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ , రష్మిక నటించిన సినిమాల వల్ల భారీ క్రేజ్ ని అందుకున్నారు. అంతేకాదు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ ఇప్పటికీ కూడా వినిపిస్తూ ఉంటాయి. పైగా ఇద్దరూ ఒకేలా డ్రెస్ వేసుకోవడం.. కళ్ళజోడు కూడా ఉపయోగించడం.. ఎక్కువగా కలిసే లొకేషన్స్ కి వెళ్లడం, పైగా విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్ లు, పండుగలలో రష్మిక దర్శనం ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటే ఎవరైనా సరే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని విషయాన్ని నమ్మక తప్పదు.. ముఖ్యంగా సినీ లవర్సే కాదు వీరి అభిమానులు కూడా ఈ విషయాన్ని నమ్మక తప్పడం లేదు అని చెప్పవచ్చు.

లవ్ మ్యారేజ్ చేసుకుంటా.. కానీ..

ఇకపోతే ఇప్పటికే విజయ్ మీద ఎన్నో రూమర్స్ వస్తున్నప్పటికీ.. విజయ్ దేవరకొండ ( Vijay deverakonda ) మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఎన్నోసార్లు తెలియజేశారు.. అయితే ఇప్పుడప్పుడే చేసుకోనంటూ కూడా వెల్లడించారు.. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి తన అమ్మ నాన్నలనే ఎక్కువగా ప్రేమించాలని.. అప్పుడే వివాహాం చేసుకుంటానంటూ తెలియజేశారు విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఒక మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాలను తెలియజేశారు.

రౌడీ హీరో పై నెటిజన్స్ కామెంట్స్..

మొత్తానికి అయితే విజయ్ దేవరకొండ తన పెళ్లి విషయం ఇలా మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. విజయ్ దేవరకొండ ఇప్పటికే ప్రేమలో ఉండడం వల్ల ఇలా మాట్లాడుతున్నారంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అందుకే విజయ్ దేవరకొండ లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఇలా డైరెక్ట్గా చెబుతున్నారని కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఫ్యామిలీ స్టార్ మూవీ విశేషాలు..

అలాగే విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మీద కూడా అభిమానులకు భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే గతంలో ఈ డైరెక్టర్ పరశురాం కాంబినేషన్లో వచ్చిన గీతాగోవిందం సినిమా కూడా మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తూ ఉండడంతో మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమాలోని పాటలు , టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా మంచి పాజిటివ్ బజ్ నే అందిస్తున్నాయి. ఇందులో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. అందుకే ఈ సినిమా పైన అభిమానులకు కాన్ఫిడెంట్ పెరిగిపోయింది.. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడంతో మరింత హైప్ పెరిగింది. ఇక ఏప్రిల్ 5వ తేదీ ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు