Salman Khan : సల్మాన్ టాలీవుడ్ బాట…!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి తెలియని వారుండరు. బాలీవుడ్ హీరో అయినా, హిందీతో పాటు ఇతర భాష ప్రేక్షకులు కూడా సల్మాన్ సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. ఆయన నటించిన ’బజరంగీ భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందా హై’ సినిమాలు 500 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చి పెట్టాయి. ఇప్పటికే స్టార్ హీరోగా ఉన్న సల్మాన్, వీటితో బాలీవుడ్ కింగ్ అయ్యాడు.

సల్మాన్ ఖాన్, ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ లోనే సినిమాలు చేసేవాడు. కానీ ఫస్ట్ టైం తెలుగులో నటించడానికి ఈ కండల వీరుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి కీలక పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

గాడ్ ఫాదర్ లో చిరంజీవి-సల్మాన్ ఖాన్ మధ్య ఓ సాంగ్ మినహా మొత్తం పూర్తి అయింది. అతి త్వరలోనే గాడ్ ఫాదర్ పాట కోసం సల్మాన్ డేట్స్ ఇస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్, తెలుగులో మరో సినిమాకు సైన్ చేశాడని సమాచారం. ఎఫ్3తో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విక్టరీ వెంకటేష్ తో సల్మాన్ ఖాన్ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడట. ఈ మూవీకి సంబంధించిన స్టోరీపై చర్చలు కూడా పూర్తి అయినట్టు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఈ మూవీ వచ్చే నెల మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్తున్నట్టు తెలుస్తుంది.

అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ అతి త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. వెంకీ మూవీ, గాడ్ ఫాదర్ సాంగ్ షూటింగ్ ఒకే డేట్స్ లో ఉండేలా, సల్మాన్ ప్లాన్ చేసుకుంటున్నారని బీ టౌన్ వర్గాల్లో టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు