Prabhas: దూకుడు పెంచిన ప్రభాస్

ఇండస్ట్రీ లో డార్లింగ్ అంటే మనకు టక్కున గుర్తొచ్చే పర్సనాలిటీ ప్రభాస్,
ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు,ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.
బాహుబలి సినిమాతో తెలుగు వాడి స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసాడు ప్రభాస్.
బాహుబలి తరువాత వచ్చిన “సాహో” సినిమా తెలుగులో కొంచెం నిరాశపర్చిన బాలీవుడ్ లో మాత్రం కలక్షన్స్ కొల్ల గొట్టింది.

రీసెంట్ గా “జిల్” ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ తో చేసిన రాధేశ్యామ్ నిరాశ పరిచినా, ప్రభాస్ నుంచి ముందు ముందు రిలీజ్ కాబోయే సినిమాలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. ప్రభాస్ భారీ సినిమాలను లైనప్ లో పెట్టిన సంగతి మనకు తెలిసిందే.

బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన “ఆది పురుష్” 2023 సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా కెజిఫ్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న “సలార్” సినిమా 35% షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాని 2023 కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మాములుగా స్టార్ హీరోల సినిమాలు సంవత్సరానికి ఒకటి అలా వస్తుంటాయి. రెండు భారీ సినిమాలు కొన్ని నెలల కాలవ్యవధిలో రిలీజ్ కావడం అంటే హర్షించదగ్గ విషయమే.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు