Sarkaru Vaari Paata : సర్కారు వారి కలెక్షన్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” గురువారం రిలీజైన విషయం తెలిసిందే. మహేష్ బాబు యాక్టింగ్, డైలాగ్స్, కీర్తి సురేష్ తో లవ్ ట్రాక్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. సెకండాఫ్ లో కాస్త సాగదీత సీన్స్ వల్ల బెనిఫిట్ షో నుండి మిశ్రమ స్పందన అందుకుంది. కానీ ఈ మూవీ కలెక్షన్ల పరంగా మంచి జోష్ లో ఉంది. తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 75 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి, టాలీవుడ్ లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

రెండో రోజు కూడా “సర్కారు వారి పాట” కలెక్షన్లలో జోష్ తగ్గలేదు. రికార్డు స్థాయిలో ఈ సినిమా వసూళ్లు చేస్తూ దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 103 కోట్లు రాబట్టింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సర్కారు వారి పాట ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిందంటూ, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ అధికారిక ట్విట్టర్ నుండి పోస్టు చేసింది.

ఈ మూవీని పరశురామ్ దర్శకత్వం వహించగా, సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, జీ. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించగా, ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు