సిద్ధార్థ్ నారాయణ్ బాయ్స్ సినిమాతో తెలుగు వాళ్లకి కి పరిచయమైన ఈ హీరో, ప్రారంభదశలో మంచి మంచి సినిమాలు చేస్తూ తెలుగులో తనకంటూ ఒక లవర్ బాయ్ ఇమేజ్ ను సాధించుకున్నాడు.
“బొమ్మరిల్లు” సినిమా సిద్ధార్థ్ కెరియర్ లో మంచి హిట్ అయింది.
ఆ తరువాత చేసిన కొన్ని సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు, “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” పరవాలేదు అనిపించింది.
ఆ తరువాత చేసిన “ఓయ్” తరువాత లవ్ డ్రామా మూవీస్ చేయలేదు.
ఆ తరువాత చేసిన చాలా సినిమాలు నిరాశనే మిగిల్చాయి.
చాలాకాలం తర్వాత మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికి తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనిపించింది సినిమా రిలీజ్ కంటే ముందు జరిగిన పరిణామాలు చూసి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. సిద్దు ప్రస్తుతం “ఎస్కేప్ లైవ్” అనే హిందీ వెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్ (Disney + Hotstar)లో మే 20 నుంచి ప్రీమియర్ కానుంది.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా సిద్దార్థ్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఈ సిరీస్‌లో నాది రెగ్యులర్ రోల్ కాదు. ఈ పాత్రలో నన్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. మంచి ఆఫర్లు వస్తే మళ్లీ బాలీవుడ్‌కు తిరిగొస్తా. ఢిపరెంట్ రోల్స్ వచ్చే వరకు యాక్టింగ్ చేస్తా. లేదంటే వేరే ఉద్యోగం చూసుకుంటా’ అని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు.