Re-Release Trend: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచనున్న మరో సినిమా..!

Re-Release Trend

టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ ఎంత జోరుగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు మాత్రమే కాకుండా ఆరెంజ్ లాంటి ఫ్లాప్ సినిమాలు కూడా రీసెంట్ గా రీరిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టాయి. ఈ క్రమంలో లీడర్ సినిమా కూడా రీరిలీజ్ అవ్వనుందని సమాచారం అందుతోంది.
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రానా డెబ్యూ మూవీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ కాకపోయినా పొలిటికల్ గా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ దగ్గరపడుతున్న తరుణంలో పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో లీడర్ సినిమా రీరిలీజ్ చేస్తే ఆ హీట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
ఒక స్టేట్ సీఎం చనిపోయిన తర్వాత ఆయన కొడుకు భవిత్యం ఏంటి అన్న పాయింట్ మీద రూపొందిన ఈ సినిమా అప్పటి ఏపీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఆధారంగా తీసారని అప్పట్లో టాక్ వచ్చింది. ఏవిఎం ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా రానా కెరీర్లో ది బెస్ట్ మూవీ అని  చెప్పవచ్చు. అప్పటిదాకా ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ మూవీస్ కి మాత్రమే పరిమితం అయిన శేఖర్ కమ్ముల పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ టార్గెట్ గా పలు సినిమాలు వస్తున్నాయి. నారా రోహిత్ ప్రతినిధి2, రామ్ గోపాల వర్మ వ్యూహం, జగన్ రాజకీయ ప్రస్థానం ఆధారంగా డైరెక్టర్ మహి వి రాఘవ్ డైరెక్షన్లో యాత్ర2 సినిమాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో లీడర్ సినిమా రీరిలీజ్ అంటూ వస్తున్న వార్తలు ఆసక్తి పెంచుతున్నాయి. ఫిబ్రవరిలో రీరిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు