Keeda Cola: వైబ్ మెంటల్ ఉందంటున్న తరుణ్ భాస్కర్..!

Keeda Cola

తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో చైతన్య హీరోగా వస్తున్న సినిమా కీడా కోలా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకి సంబందించిన గ్లిమ్ప్స్ ఇటీవలే రిలీజయ్యి సినిమాపై ఆసక్తి పెంచింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. నవంబర్ 03న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది సినిమా యూనిట్.

పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి ప్రయత్నంలోనే తన ప్రత్యేకత చాటుకున్నాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమా లాంటి యూత్ ఫుల్ సినిమా చేసి హిట్ అందుకున్న తరుణ్ చాలా కాలం పాటు మెగా ఫోన్ కి దూరంగా ఉన్నాడు.

ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత తరుణ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా కీలక పాత్రలో కనిపిస్తుండటం విశేషం. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకత చాటుకుంటున్న హీరో చైతన్యకి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాయం అని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ని షేర్ చేస్తూ తరుణ్ భాస్కర్ వేసిన ట్వీట్ కూడా సినిమాపై ఆసక్తి పెంచుతోంది. మీ కోసం పర్ఫెక్ట్ డ్రింక్ ని రెడీ చేశామని, నవంబర్ 3న థియేటర్స్ కలుద్దామని, మెంటల్ వైబ్ ఉండబోతోందని ట్వీట్ చేశాడు తరుణ్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా సమర్పిస్తున్న ఈ సినిమా కూడా ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు వంటి యూత్ ఫుల్ హిట్ అవుతుందా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు