Chaitanya Rao: అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్.. మొత్తం 80స్ లోనే.. కానీ?

యూట్యూబ్ స్టార్ చైతన్య రావు హీరోగా అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాను “బిగ్బెన్ సినిమాస్” బ్యానర్ లో యష్ రాగినేని నిర్మించగా, చందు ముద్దు దర్శకత్వం వహించాడు. ఈ మధ్యనే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా ఈ సినిమా యొక్క అఫిషియల్ ట్రైలర్ విడుదలయింది.

అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని గమనిస్తే టైటిల్ కి తగ్గట్లే ఈ సినిమా ఉంది. అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రం పూర్తిగా 80స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారని తెలుస్తూనే ఉంది. పూర్తి కామెడీ జోనర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కగా గోదావరి పరిసర ప్రాంత నేపథ్యంలో కథ సాగుతుంది. అందువల్ల సినిమాలో చూపించిన పల్లెటూరి వాతావరణం చాలా బాగుంది.

- Advertisement -

ఇక ఈ సినిమాలో హీరో తన ఫ్యామిలీ ద్వారా సంక్రమించిన ఫోటో స్టూడియో ని నడుపుకుంటూ సింపుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ, అదే ఊళ్ళో ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయిని పొందటానికి హీరో పడే పాట్లు, ఆ తరుణంలో హీరో లైఫ్ లో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఒక థ్రిల్లింగ్ స్టోరీ ఉంటుందని ఈ ట్రైలర్ లో చూపించారు. ఇక ఈ సినిమాకి 80స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యం ఎంచుకోవడం వల్ల సినిమాకి కూడా అదే కాలానికి సంబంధించిన మ్యూజిక్ సినిమా మొత్తం ఇచ్చారు. అది మంచి ఫీలింగ్ ఇస్తున్నా ఫ్రెష్ ట్యూన్స్ ఉంటే బాగుండేది.

ఈ సినిమాతో హీరో చైతన్య రావు మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడం ఖాయం. ఇక ఈ సినిమాలో ఎక్కువగా కొత్త నటుల్నే తీసుకున్నారు. ప్రిన్స్ హెన్రీ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించాడు. ఇక ఈ సినిమాను జులై 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు