Prabhas: ప్రాజెక్ట్ కే ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్తుంది?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికతో ఈ సినిమాపై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ కే సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ద్వారా తెలిసింది. లీక్ అయిన స్టిల్స్ కుడా అలాంటి సూచనలే చెప్తున్నాయి. అయితే కొంతమంది ఈ సినిమా లో ప్రభాస్ విష్ణుమూర్తి గా కనిపిస్తున్నాడని ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లోనే భగవంతుడికి లింక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. మరికొందరు కల్కి పాత్రను బేస్ చేసుకొని ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

కానీ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఒక సోషియో ఫాంటసి మూవీ గా ఉండబోతుందని, ఇంచుమించు ఆదిత్య 369 లాగా టెక్నాలజి చూపిస్తూ చరిత్ర కి లింక్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఒక భగవంతుడి అంశతో వచ్చి సాధారణ మనిషిలా దేశంలో వచ్చే ఒక పెద్ద సమస్యని పరిష్కరిస్తాడని, దాని వల్ల మైథాలజీ కి, సైన్స్ కి ముడిపెట్టి భగవంతుడి గొప్పతనాన్ని దర్శకుడు తెలియచెప్పాలనుకుంటున్నాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అంతే కాదు అయితే కామన్ ప్రేక్షకులు, ఇంకా ఫ్యాన్స్ మాత్రం అసలు ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కుతుందో క్లారిటీ ఇవ్వమని సోషల్ మీడియా లో డైరెక్టర్ ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ తో నైనా సినిమా మీద ఒక క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు