Madhavi Latha: పెళ్లి చేసుకుంటే విడాకులే.. టాలీవుడ్ హీరోయిన్ సంచలనం !

Madhavi Latha

టాలీవుడ్ హీరోయిన్ మాధవి లతా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అచ్చమైన తెలుగమ్మాయి మాధవి లత. నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాలతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత అవకాశాలు రాక వివాదాస్పద వాక్యాలు చేసి వార్తల్లో నిలిచింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు అతిధి సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన ఈమె ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తనకు జరిగిన చేదు అనుభవం గురించి వైరల్ కామెంట్స్ చేసింది. అలా ఈమె పేరు ఒక సందర్భంలో బాగా మారుమ్రోగిపోయింది. హీరోయిన్ గా అవకాశాలు రాక బిజెపి పార్టీలో చేరి సినిమాలకు ఇంకా నటనకు పూర్తిగా దూరంగా ఉంది. అయితే ఇప్పటివరకు మాధవి లత పెళ్లి చేసుకోలేదు.

దీంతో ఆమె పెళ్లి గురించి ప్రేక్షకుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఆమె షేర్ చేసిన వీడియోలో పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఇచ్చి పడేసింది. ఫేస్బుక్లో ఓ నెటిజన్ చేసిన కామెంట్స్ కు బాధపడిన మాధవి లత తన పెళ్లి గురించి ఘాటుగానే బదులిచ్చింది.

- Advertisement -

మాధవి లత మాట్లాడుతూ…’పెళ్లి చేసుకోకపోతే ఈ భూమి మీద బతికే అర్హత లేదా? పెళ్లి చేసుకొని వాళ్లకు నిజంగానే బలుపు ఉంటుందా? పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే వెంటనే మంచిగా అవుతానా? మీ మాటలు చూస్తే… పెళ్లి చేసుకోలేదంటే నాకు ఆత్మాభిమానం ఉన్నట్టే కదా?’ అంటూ వీడియోలో ఫన్నీగా చెప్పుకొచ్చింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు