Krithi Shetty: మెగా కోడలు కాబోతున్న హీరోయిన్ కృతి శెట్టి?

Krithi Shetty

కృతి శెట్టి గురించి తెలియని వారండరు. ఉప్పెన సినిమాతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది కృతి శెట్టి. ఈ మూవీ విడుదలకు ముందే ఈ ముద్దుగుమ్మ భారీగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి.

ఈ సినిమా తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్స్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో కృతికి అవకాశాలు తగ్గాయి. నిన్న మొన్నటి వరకు క్రేజీ హీరోయిన్ అనే ట్యాగ్ తో టాలీవుడ్ లో తెగ వైరల్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయారు. వరుస ఫ్లాప్స్ రావడంతో కాస్త సైలెంట్ అయిపోయారు. అయితే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుందని అంత అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీకి బ్యాడ్ లక్ ఎదురైంది.

కృతి శెట్టి చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. చివరిగా వచ్చిన నాగచైతన్య కస్టడీ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా కృతి శెట్టి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ తో ఆమె వివాహం అంటూ నెట్టింట వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైందని పలు రకాలుగా చెప్పుకొస్తున్నారు.

- Advertisement -
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు