BigBoss7: జెన్యూన్ గా ఆడుతున్న ఒకే ఒక్కడు? ఇప్పుడు ఎలిమినేట్ అయితే?

BigBoss7:

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 ఇంట్రెస్టింగ్ గా జరుగుతూనే మలుపులు తీసుకుంటుంది. మొదలై రెండు వారాలు గడవక ముందే ఎన్నో ట్విస్టులు, మనస్పర్థలతో ఊపందుకుంది. చాలా మంది ఈ సీజన్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండదనుకున్నారు. ఎందుకంటే ఆడియన్స్ కి పెద్దగా తెలియని వారే ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చారు. అయినా కంటెస్టెంట్లు తమ ఆటతో ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు.

అయితే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ లో అందరూ వారి వారి పేరును వాడుకుని డప్పు కొట్టుకుంటున్నారు. కొందరు బాగా ఆడుతున్నా, ఎదో ఒక సందర్భంలో వాళ్ళ ఆటిట్యూడ్ చూపిస్తున్నారు. కానీ తెలుగు ఆడియన్స్ ఎవ్వరికి తెలియని ఒక వ్యక్తి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి జెన్యూన్ గా ఆడుతున్న ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచాడు, అతనే ప్రిన్స్ యావర్.

ముంబై కి చెందిన ఒక సాధారణ మోడల్ అయిన ఇతను ఆ ఫీల్డ్ లో పెద్దగా ఎదగలేక, హైదరాబాద్ లో ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుని సెట్టిల్ అయిపోదామని వచ్చాడు. అలాంటి క్రమంలో అనుకోకుండా బిగ్ బాస్ ఆఫర్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ వచ్చి రావడంతోనే తనకు రాని భాషతో తంటాలు పడ్డాడు యావర్.

- Advertisement -

అయినా కూడా అందరితో కలిసిపోయి చెప్పిన టాస్క్ లో ఆడాడు. ఒకానొక సందర్భంలో లేడీస్ లా రెడీ అయ్యి నవ్వుల పాలయ్యాడు. అయినా ఫీల్ అవ్వకుండా, అన్ని రకాల గేమ్ లో వాగ్వాదానికి తావివ్వకుండా, పార్టిసిపేట్ చేసాడు. కానీ బిగ్ బాస్ యావర్ తెలుగులో మాట్లాడట్లేదని పనిష్మెంట్ ఇచ్చాడు. అప్పుడు కూడా యావర్ క్షమించమని ఇకపై తెలుగులో మాట్లాడతానని పనిష్మెంట్ తీసుకున్నాడు.

తాజాగా మాయాస్త్ర భాగాలుగా పంచే క్రమంలో గౌతమ్ కృష్ణ యావర్ తో గొడవకి దిగాడు. ఇక ఎలిమినేషన్ లో కూడా యావర్ కి పెద్దగా తెలుగు ఆడియన్స్ సపోర్ట్ లేకుండా పోయింది. మరి అందరిలా కాకుండా కరెక్ట్ గా ఆడుతున్న యావర్ ని తెలుగు ఆడియన్స్ ఓట్స్ వేస్తారా? గత వారం తప్పించుకున్న యావర్ ని ఈ వారం ఎలిమినేట్ చేస్తారా? లేక ప్రేక్షకులు ఓట్లు వేసి కాపాడతారా అనేది చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు