Shankar: గేమ్ ఛేంజర్ లో చరణ్ కి ఆ రోల్ వర్కౌట్ అవుతుందా.?

దాదాపు 17 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసి, 1993లో జెంటిల్మెన్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శంకర్. ఆ తర్వాత ఎన్నో సంచలనాత్మకమైన హిట్ సినిమాలను సౌత్ సినిమా ఇండస్ట్రీకి అందించాడు. శంకర్ సినిమా అంటే బీభత్సమైన అంచనాలు ఉంటాయి. ఇప్పుడు అంతా పాన్ ఇండియా పాన్ ఇండియా అని అనుకుంటున్నాము కానీ ఒకప్పుడు శంకర్ చేసిన సబ్జెక్ట్స్ అన్ని పాన్ ఇండియా లెవెల్ లో ఉండేవి.

శంకర్ సినిమా అంటేనే ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుందని చెప్పొచ్చు. కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి ఒక మెసేజ్ ని అందిస్తాయి శంకర్ సినిమాలు. జెంటిల్మెన్ సినిమా తర్వాత ప్రేమికుడు భారతీయుడు వంటి సినిమాలు అద్భుతమైన ఘన విజయాలను సాధించుకున్నాయి. అయితే పేరుకు తమిళ్ దర్శకుడు అయినా కూడా తెలుగులో కూడా శంకర్ కి మంచి పాపులారిటీ ఉంది.

శంకర్ తో సినిమా చేయాలని తెలుగు స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకానొక సందర్భంలో ఆన్ స్టేజ్ చెప్పకోచ్చారు. రజనీకాంత్ రోబో సినిమా రిలీజ్ సందర్భంగా శంకర్ మంచి దర్శకుడు అని రజనీకాంత్ చిరంజీవితో చెప్పటం. నువ్వు ఎప్పటికైనా పని చేయాలి అని కూడా రజినీకాంత్ చెప్పడంతో చిరంజీవి కూడా ఒక రకంగా శంకర్ తో పని చేయాలని ఆశ కలిగింది.

- Advertisement -

అయితే చిరంజీవి శంకర్ కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా పట్టాలెక్కలేదు. కానీ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో శంకర్ ప్రస్తుతం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి గల కారణం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వస్తున్న 50వ సినిమా కావడం.

అన్నిటికంటే ముఖ్యంగా ఇది శంకర్ తెలుగులో చేస్తున్న స్ట్రైట్ ఫిలిం అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఒక రాజకీయ నేపథ్యంలో కూడా జరుగుతుంది అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐపీఎస్ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా నుంచి రీసెంట్ గా రాంచరణ్ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి.

ఇదివరకే రామ్ చరణ్ పోలీస్ రోల్ లో కనిపించిన సినిమా జంజీర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. మరి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో రా అండ్ రగ్గడ్ లుక్ సినిమాలు చేస్తున్న చరణ్ కి ఈ ఐపీఎస్ రోల్ ఎంతవరకు సూట్ అవుతుందని చాలామంది సందేహ పడుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి అప్డేట్ ను చరణ్ పుట్టినరోజుకి ఇస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు దిల్ రాజు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు