Rajavaaru Raanigaaru: పెళ్లి గురించి తెలిసే పాట రాసారా.?

ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో తనలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసి మెల్లమెల్లగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించుకుంది. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ చాలామందికి బాగా కనెక్ట్ అయ్యాయని చెప్పొచ్చు.

ఒక సింపుల్ లవ్ స్టోరీని అందమైన లొకేషన్స్ లో అత్యద్భుతమైన క్యారెక్టర్స్ తో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రవి కిరణ్ కోలా. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు 90స్ యూత్ ఎక్స్పీరియన్స్ చేసిన చాలా నాస్టాలజియా మూమెంట్స్ ని చిత్రీకరించి చాలామందికి ఈ సినిమాను కనెక్ట్ అయ్యేలా చేశాడు రవి కిరణ్.

ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత చేసిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే కేవలం ఈ సినిమాలో కిరణ్ నటుడిగానే కాకుండా తనలోని రైటర్ టాలెంట్ ని కూడా బయటికి తీసుకొచ్చాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు తర్వాత కిరణ్ కి ఇంకా తిరుగులేదు అని చాలా మంది భావించారు. వరుస అవకాశాలు కూడా క్యూ కట్టాయి.

- Advertisement -

ఇకపోతే కిరణ్ ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది అని చెప్పొచ్చు. తర్వాత చేసిన ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంటూ కమర్షియల్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. అయితే ఈ మధ్యకాలంలో కిరణ్ అబ్బవరం ను ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు.

అయితే వీటన్నిటికీ అతీతంగా తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇస్తాడు అనుకుంటున్న తరుణంలో తను ఒక ఇంటివాడు అవ్వబోతున్నట్లు రీసెంట్ గా తన మొదటి సినిమా హీరోయిన్ తో నిశ్చితార్థం చేసుకొని తన పెళ్లి అప్డేట్ ఇచ్చాడు. కిరణ్ అబ్బవరం నటించిన రాజావారు రాణి గారు సినిమాలో కిరణ్ సరసన చేసిన రహస్య గోరక్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు కిరణ్.

అయితే రాజావారు రాణి గారు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ సినిమా ఆడియో కూడా అంత పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో ఉన్న రాజావారు రాణి గారు అనే పాట ఈ సినిమా పైన మంచి అంచనాలను పెంచింది. అయితే ఈ పాటలో ఒక లిరిక్ ఇప్పుడు రియల్ లైఫ్ లో రుజువు అయింది.

రాజావారు, రాణీగారు
రేపో మాపో ఒకటౌతారు
ఊరూవాడా ఈడూజోడూ బాగుందంటారూ
రాజా వేరు, రాణి వేరు
సూత్తూ ఉండు జంటౌతారు
ఆ రోజంతా ఊరూరంతా హోరెత్తే తీరు.

అని ఈ పాటలో రచయిత తెలిసి రాశాడో తెలియక రాశాడో కానీ జీవితంలో మాత్రం ఈ లిరిక్స్ నిజమయ్యాయి అని చెప్పొచ్చు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు