Raashii Khanna : మళ్ళీ 14ఏళ్లు తర్వాత

2013 లో రిలీజ్ అయిన హిందీ సినిమా మద్రాస్ కేఫ్ లో ఇంటిలిజెంట్ అధికారి భార్య రూబీ పాత్రలో కనిపించింది రాశీ ఖన్నా. ఆ తర్వాత శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతోనే నాగ శౌర్యకి కూడా మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమాతో దర్శకుడుగా శ్రీనివాస్ అవసరాల మంచి పేరును సాధించుకున్నాడు.

ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత రాశీ ఖన్నా చేసిన జోరు, జిల్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందించలేదు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తన రెండవ సినిమా సుప్రీం లో మెగా హీరో సాయి తేజ్ పక్కన నటించి ఆ సినిమాతో అద్భుతమైన హిట్ ను తన ఖాతాలో వేసుకుంది రాశీ. ఆ సినిమా తర్వాత చేసిన హైపర్ సినిమా అంతంత మాత్రమే ఆడింది.

ఇక ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ అనే సినిమాలో ఎన్టీఆర్ తో సహా నటించింది రాశీ. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో మంచి హిట్ అయింది. అప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న బాబి ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ అనే సినిమాతో మంచి హిట్ అందుకుంది.

- Advertisement -

ఇక ఈ హిట్ సినిమా తర్వాత రాశి కెరియర్లో వరుసగా డిజాస్టర్లు వచ్చాయి. ఇక వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమైన తొలిప్రేమ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చింది రాశి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ను పెట్టి వరుణ్ తేజ్ తో ఈ సినిమాను చేసి మంచి హిట్ కొట్టాడు వెంకీ. ఈ హిట్ సినిమా రాశి కెరీర్ కి కూడా మంచి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు రాశి కెరియర్లో వచ్చాయి.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రాసి కన్నా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాల్తా కొట్టాయి దాదాపు కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ధనుష్ నటించిన తిరు సినిమాతో మంచి హిట్ అందుకుంది ఆ తర్వాత కార్తీ నటించిన సర్దార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

అయితే మళ్లీ ఇప్పుడు రాశీ దాదాపు 14 ఏళ్లు తర్వాత హిందీలో ఎంట్రీ ఇచ్చిందని చెప్పొచ్చు. మద్రాస్ కేఫ్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాసి ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ లో ఎంతటి సూపర్ హిట్ ఫిలిమ్ ని అందుకుంటుందో తెలియాలి అంటే కొంతవరకు వేచి చూడకు తప్పదు. ఈ సినిమా ఫలితాన్ని బట్టి రాశీ నెక్స్ట్ లైనప్ ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు