టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా రాణించాలంటే కచ్చితంగా గ్లామర్ డోస్ ఉండాలి. గ్లామర్ షో చేయకపోతే అస్సలు చాన్సులు రావు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల అందరూ ఇదే ఫార్ములాను కొనసాగిస్తున్నారు. లేకపోతే సినిమాలు ఆపేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించేందుకు బీభత్సంగా తమ అందాలను ఆరబోస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో రాశి కన్నా ఒకరు. హీరోయిన్ రాశి కన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
రాశిఖన్నా కెరీర్ లో ఒడిదొడుకులు
హీరోయిన్ రాశి కన్నా అందంతోపాటు మంచి హైట్ కూడా ఉంటుంది. పాల బుగ్గల లాంటి పెదాలు, సుతి మెత్తని కండ్లు ఈ బ్యూటీ సొంతం. ఢిల్లీకి చెందిన హీరోయిన్ రాశి కన్నా… మద్రాస్ కెఫే అనే హిందీ సినిమాతో బాలీవుడ్లోకి వచ్చింది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ రాసి కన్నా. తెలుగులో మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రాశికన్నా. ముఖ్యంగా 2014 సంవత్సరంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు హీరోయిన్ రాశి కన్నా.
బడా హీరోలతో సినిమాలు
అతి తక్కువ కాలంలోనే బడా హీరోలతో సినిమాలు చేసింది హీరోయిన్ రాశి కన్నా. రవితేజ తో బెంగాల్ టైగర్, హీరో రామ్ తో శివం, సుప్రీమ్, హైపర్ లాంటి సినిమాలు చేసింది ఈ బ్యూటీ. గోపీచంద్ తో జిల్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకుంది. అటు వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేసింది హీరోయిన్ రాశి కన్నా.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లు అలాగే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తన అంద చందాలను కూడా ఆరబోస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా అదిరిపోయే డ్రెస్ లో మెరిసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.