Yamuna: నేను ఏ తప్పు చేయలేదు.. హోటల్లో జరిగింది ఇదే – యమున..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో హీరోయిన్ యమునా కూడా ఒకరు.. ఒకప్పుడు తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. రామోజీరావు నిర్మించిన మౌన పోరాటం సినిమాలో నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది.. యమునా హీరోయిన్ గా తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం వంటి భాషా చిత్రాలలో కూడా నటించింది.. ప్రస్తుతం బుల్లితెర పై పలు రకాల సీరియల్స్ లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. యమునా ఎంత త్వరగా స్టార్ స్టేటస్ ను సంపాదించుకుందో అంతే త్వరగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంది.

రెడ్ హ్యాండెడ్ గా దొరికిన యమున..
ముఖ్యంగా ఈమె బ్రో*ల్ కేసులో అరెస్టు అవడం వెనుక చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.. మరి ఈమె నిజంగానే ఇలాంటి పని చేసిందా? లేకపోతే కావాలని ఇరికించారా? అనే విషయం పై ఈమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చేసింది.. అసలు విషయంలోకి వెళ్తే.. యమునా బెంగళూరులోని ITC గార్డెన్ హోటల్లో పట్టు పడిందని పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.. అంతేకాదు యమున పైన కేసు కూడా పెట్టి.. వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అని ఆరోపణలను చేశారు..

వ్యభిచారం చేస్తూ పట్టుబడడం పై క్లారిటీ..
అయితే తాను అలాంటి పని చేయలేదని ఒకవేళ చేసి ఉంటే ఐదు సంవత్సరాలు కోర్టులో పోరాడేదాన్ని కాదంటూ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. అంతేకాకుండా తాను అక్కడికి వెళ్ళింది CCB ఆఫీసుకు మాత్రమే అని వెల్లడించింది.. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే అంత ఫైట్ చేసి ఏడ్చాను అంటూ వెల్లడించింది.. యమునను సిసిబి ఆఫీస్ కి ఒక ఎంక్వయిరీ ఉందని పిలిపించారట.. అయితే అలా వెళ్లి అన్ని డీటెయిల్స్ చెప్పినప్పటికీ ఆ తర్వాత తనని కావాలని కొంతమంది ఇరికించి మళ్లీ కేసు పెట్టించారని వెల్లడించింది.

- Advertisement -

తండ్రి మరణం పై స్పందన..
తాను అరెస్ట్ అయి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రాగా తనపై పెట్టిన కేసులు అన్ని అబద్ధాలు అని ఒక్కొక్కటిగా బయటపడ్డాయని.. తనని అరెస్టు చేసినందుకు పోలీసులు ఎక్కడా కూడా ఎలాంటి ప్రూఫ్ చూపించలేకపోయారని.. చివరికి కోర్టు నుంచి తాను ఏ తప్పు చేయలేదని ఆర్డర్ కూడా సంపాదించానని యమునా తెలిపింది.. అయితే తనని అలాంటి కేసులో కావాలని కొంతమంది ఇరికించారని.. దానివల్లే తాను కొన్నేళ్ల పాటు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని చివరికి తన తల్లిదండ్రులకు కూడా దూరమయ్యానని..ఆ సమయంలో తన తండ్రి కూడా మరణించారని తెలియజేసింది. ఇలాంటి బాధలు చెప్పుకోలేనివి అంటూ యమున వెల్లడించింది.. ప్రస్తుతం యమున చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇక ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంది యమున.. ఏదేమైనా తాను చేయని తప్పుకు ఇన్ని సంవత్సరాలు శిక్షణ అనుభవించానని ఎమోషనల్ అయింది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు