Thaman: మహేష్ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకున్న థమన్

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. మహేష్ వరుస సినిమాలు చేస్తున్న తరుణంలో మురారి సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటే ఒక్కడు. మహేష్ ని ఒక కమర్షియల్ హీరోగా నిలబెట్టిన సినిమా ఒక్కడు.

ఒక్కడు సినిమా తర్వాత మహేష్ కెరియర్ లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డును కూడా సృష్టించాయి. అయితే మహేష్ కెరియర్ లో అతడు, పోకిరి, అర్జున్, ఖలేజా వంటి సినిమాలు ఆయనకు మంచి పేరును తీసుకొని వచ్చాయి. అయితే అతడు, ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఆడలేదు. కానీ మహేష్ లోని ఒక పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసుకొచ్చిన సినిమాలని చెప్పొచ్చు.

ఇకపోతే దూకుడు, బిజినెస్ మేన్ లాంటి సినిమాలు మహేష్ బాబుకి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును తీసుకొచ్చి పెట్టేయ్. అయితే మహేష్ కెరియర్లో కమర్షియల్ గా హిట్స్ సాధించకపోయినా కూడా అతడు, ఖలేజా సినిమాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలు ఇప్పుడు టీవీలో వచ్చిన ప్రతిసారి కూడా హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటాయి.

- Advertisement -

ఇక రీసెంట్ గా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా గుంటూరు కారం. అయితే ఈ సినిమా పైన అందరికీ ఎన్నో అంచనాలు ఉండేవి. ఈ అంచనాలన్నీ కూడా ఈ సినిమా రిజల్ట్ తో తారుమారు అయిపోయాయి అని చెప్పొచ్చు. ఇది మాస్ కమర్షియల్ సినిమా అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్లిన ఆడియన్స్ అందరికీ ఇది ప్రాపర్ త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ సినిమా అని అర్థం అయింది. అయితే ఇది అర్థమయ్యేలోపే ఈ సినిమా నెగిటివ్ టాక్ బయటకు వచ్చేసింది.

ఇకపోతే మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ వలన ఎంతో కొంత సేఫ్ జోన్ లో ఉంది ఈ సినిమా. అయితే ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు. అరవింద సమేత వీర రాఘవ సినిమా నుంచి త్రివిక్రమ్ చేస్తున్న ప్రతి సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తూ వచ్చాడు. అలా గుంటూరు కారం సినిమాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా తమనే మ్యూజిక్ అందించాడు. ఇకపోతే ఈ సినిమా మ్యూజిక్ కూడా బాగానే హిట్ అయింది.

రీసెంట్ గా ఈ గుంటూరు కారం సినిమా నుంచి అమ్మ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉండదు. కానీ ఈ సాంగ్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇదే సినిమాలో ఇంకో సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నామని ఇదివరకే ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు తమన్. అయితే మళ్లీ ఇంస్టాగ్రామ్ లో ఇంకో సాంగ్ లేదు అంటూ కన్వే అయ్యేలాగా మరో స్టోరీని పెట్టుకోచ్చాడు. అయితే ఇప్పుడు ఆ ట్విట్టర్లోని ఆ ట్వీట్ ని కూడా డిలీట్ చేశాడు. దీనిపై మహేష్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు