Thaman : వాహ్.. థమన్ ఇరగ్గొట్టాడుగా.. మ్యూజిక్ కాదు..

టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఎస్ కూడా ఒకరు. అంతే కాదు తెలుసులో ఎక్కువ సినిమాలు చేస్తూ సౌత్ లోనే బిజీయెస్ట్ సంగీత దర్శకుల్లో ఒకరిగా నిలిచాడు. ఇక గత కొంత కాలంగా దేవిశ్రీ ప్రసాద్ లాంటి సంగీత దర్శకులు కాస్త డల్ అయ్యేసరికి తెలుగు సంగీత దర్శకులు ఎక్కువగా ఇతర ఇండస్ట్రీల నుండి మ్యూజిక్ డైరెక్టర్లను తెచ్చుకోవడం స్టార్ట్ చేసారు. ఈ క్రమంలో వాళ్ళ ఆ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. అలాంటి సమయంలో టాలీవుడ్ కి థమన్ బెస్ట్ ఆప్షన్ అయ్యాడు. మాస్ హీరోల సినిమాలకి సూపర్ ట్యూన్లు ఇస్తున్నాడు. ఈ మధ్య కాలంలో భీమ్లా నాయక్, గుంటూరు కారం లాంటి సినిమాల పాటలకు థమన్ ఏ రేంజ్ లో సాంగ్స్ ఇరగ్గొట్టాడో తెలిసిందే.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్..
ఈ క్రమంలో థమన్ తాను ఏ ఫీల్డ్ లో ఉన్నా ఇరగ్గొట్టడమే తనకి తెలుసని ప్రూవ్ చేసుకుంటున్నాడు థమన్. తాజాగా ఇండియా వైడ్ గా అన్ని సినిమా ఇండస్ట్రీ లకు సంబంధించి CCL2024( సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మ్యాచ్ లు జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుండి స్టార్ హీరోలు, టెక్నిషియన్లు కూడా ఈ లీగ్ లో ఆడుతున్నారు. హీరోలు అక్కినేని అఖిల్, నిఖిల్ సిద్ధార్థ్, సుధీర్ బాబు, అశ్విన్ బాబు లాంటి స్టార్లతో పాటు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ మ్యాచుల్లో ప్లేయర్లుగా ఆడుతున్నారు. ఈ ఇయర్ క్రికెట్ మైదానంలో సినీ తారల అత్యుత్తమ ప్రదర్శనతో అద్భుతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు.

telugu warriors CCl Match

- Advertisement -

ఇరగ్గొట్టుడే తెలుసు..

ఈ క్రమంలో తాజాగా గత రాత్రి జరిగిన ccl లో 7వ మ్యాచ్‌లో పంజాబ్ డి షేర్ జట్టుతో తెలుగు వారియర్స్ హోరాహోరీగా తలపడింది. ఇక మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతుండగా, థమన్ నిఖిల్ క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో చేజింగ్ లో థమన్ హైలెట్ అయ్యాడు. ఇక మ్యాచు ఛేజింగ్ టైం లో అశ్విన్ ముందుగానే నిష్క్రమించినప్పుడు థమన్ బ్యాటింగ్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే మ్యాచ్ ని ముందు నెమ్మదిగానే స్టార్ట్ చేసిన థమన్, ఆ తర్వాత వరుస సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆ క్రమంలో థమన్ షాట్‌కు ప్రయత్నిస్తున్నప్పుడు బంతిని స్ట్రాంగ్ గా కొట్టినప్పుడు బ్యాట్‌ విరిగిపోయింది. ఇక థమన్ విరిగిన బ్యాట్ యొక్క క్లిప్‌లు మరియు స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. థమన్ తెలుగు వారియర్స్ జట్టులో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక గత రాత్రి అతను రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 30 బంతుల్లో 67 పరుగులు చేసి తనకు ఎక్కడైనా సరే తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక థమన్ అద్భుత ప్రదర్శనతో తెలుగు వారియర్స్ పంజాబ్ డి షేర్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Thaman in CCL

ఇక థమన్ ప్రస్తుతం గేమ్ ఛేంజెర్, ఓజి చిత్రాల మ్యూజిక్ సెట్టింగ్స్ బిజీ అవుతున్నాడు. ఇవే కాకుండా అరడజనుకు పైగా మీడియం రేంజ్, చిన్నచిత్రాలు కూడా ఉన్నాయి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు