Shaking Seshu: సూసైడ్ చేసుకోవాలనుకున్న జబర్దస్త్ కమెడియన్.. కారణం..!!

బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రసారమవుతూ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ షో ఎంతో మందికి అండగా నిలిచింది. పొట్టకూటి కోసం హైదరాబాదు వచ్చిన ఎంతోమంది నటీనటులు ఈ జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాతే కోట్ల రూపాయలను కూడబెట్టి తమకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపును సంపాదించుకున్నారు.. అంతేకాదు ఈ జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ను ఇచ్చిందని చెప్పవచ్చు.. ఇందులో యాంకర్స్ , కమెడియన్సు సైతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. మరి కొంతమంది హీరోగా, డైరెక్టర్ గా సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. జబర్దస్త్ షో ప్రారంభం నుంచి కమెడియన్ గా మెప్పించిన కమెడియన్ షేకింగ్ శేషు జబర్దస్త్ కమెడియన్లలో ఒకరు.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా అలరించారు. ముఖ్యంగా తాగుబోతు క్యారెక్టర్లలో కూడా మంచి పాపులారిటీ సంపాదించారు.. మిమిక్రీ తో కూడా అందరిని ఆకట్టుకున్నారు.

జబర్దస్త్ నుంచి వీడడం..
జబర్దస్త్ లో భారీ క్రేజీ వచ్చినప్పటికీ సినిమాలలో అవకాశాలు రావడంతో కొన్నేళ్లపాటు జబర్థస్త్ ను వదిలేశారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో జబర్థస్త్ కి కూడాషేకింగ్ శేషు దూరమయ్యారు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితుల గురించి.. తన జర్నీ గురించి తెలియజేశారు.. అలాగే సినీ నటుడు ఉదయ్ కిరణ్ పైన కూడా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు షేకింగ్ శేషు.. వాటి గురించి చూద్దాం.

సినిమా ఆఫర్లపై స్పందించిన శేషు..
జబర్దస్త్ లో నటిస్తున్న సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సుప్రీం సినిమాలో తనకు ఆఫర్ ఇచ్చారని తెలిపారు.. అలా సినిమాల కోసమే జబర్దస్త్ ను వదిలేసి సినిమాలలోకి వచ్చాను అంటూ వెల్లడించారు. గతంలో అయితే బాగానే ఆఫర్స్ వచ్చాయి.. కానీ ఇటీవల కాలంలో ఆఫర్లు రాలేదని.. తమని పట్టించుకునే వారు లేరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. దీంతో తనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని.. అదే సమయంలో కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఎన్నో విమర్శలు వస్తాయని..తన కుటుంబం కోసం కూడా ఆలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని తెలిపారు షేకింగ్ శేషు..

- Advertisement -

ఉదయ్ కిరణ్ మరణ వార్త గురించి..
ఇలాంటి సమయంలోనే ఉదయ్ కిరణ్ ప్రస్తావన తీసుకువస్తూ ఉదయ్ కిరణ్ కు కూడా అవకాశాలు రాకనే ఆత్మహత్య చేసుకున్నారంటూ వెల్లడించారు.. అంతేకాకుండా ఆయన చావుకి ఆఫర్లు ఇవ్వని వాళ్లు కూడా కారణమే అంటూ కూడా వెల్లడించారు.. చిన్నదో .. పెద్దదో ఏదైనా క్యారెక్టర్ ఇస్తే కాస్తో… కూస్తో మాలాంటి నటీనటులకు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుందంటూ వెల్లడించారు.. కానీ ఈమధ్య చాలామంది నటులకు అవకాశాలే రావడం లేదంటూ వెల్లడించారు..చాలా రోజుల తర్వాత షేకింగ్ శేషు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు