Music director: ఇండియాలోనే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్… రెమ్యునరేషన్ ఎంతంటే..?

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ కారణంగా తెలుగు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంటున్నాయి. ఈ విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ల పాత్ర కూడా చాలా ఉంది. అయితే ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్స్ ఎవరో అందరికీ తెలిసిందే. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రం చెప్పడం అసాధ్యం. ఒకరిని మించి మరొకరు మ్యూజిక్ డైరెక్టర్లు తమ అద్భుతమైన టాలెంట్ తో అంతకుమించి మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలోనే ఇండియాలో ఆల్ టైం ఫేవరెట్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఏ ఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి, ఇళయరాజా వంటి వారు చాలా మంది ఉన్నారు. మరి వారిలో నెంబర్ వన్ ఎవరు అనేదాని గురించి ఇప్పుడు చూద్దాం..

అనిరుధ్ క్రేజ్…
ప్రస్తుతం ఇండియా మొత్తంగా మ్యూజిక్ వరల్డ్ ను ఏలుతున్నది మాత్రం ఒక్కరే అని చెప్పాలి. ఆయనే స్టార్ సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ఈయన కెరియర్ తమిళ్ సినిమా ద్వారా ప్రారంభమైంది. ధనుష్ నటించిన 3 సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి సంగీత ప్రియులకు దగ్గరయ్యారు. 2012లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాదు ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకులను అంతే స్థాయిలో అలరించాయి. ఒక తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి, నాని నటించిన జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో పాటు సమంత నటించిన యూటర్న్ చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందించారు రవిచందర్.

బాలీవుడ్ లో కూడా సత్తా…
ఒక సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ డెబ్యూ తో కూడా అదరగొట్టేశాడు. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఇటీవల నటించిన జవాన్ సినిమాకి అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్ లో దూసుకుపోయింది. దీంతో ఇండియా మొత్తం అనిరుద్ సంగీతానికి భారీ డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు.

- Advertisement -

అనిరుద్ రెమ్యూనరేషన్…
ఇండియా మొత్తంగా భారీ పాపులారిటీ దక్కించుకోవడంతో జవాన్ చిత్రం కోసం రూ .10 కోట్ల రెమ్యూనరేషన్ కూడా అందుకున్నారు. అంతేకాదు అత్యధికంగా పారితోషకం తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం దేవర, ఇండియన్2, లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, SK 23 వంటి చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు అనిరుధ్ రవిచందర్.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లకు పోటీగా…
ఇప్పటికే దేవిశ్రీప్రసాద్, ఎస్ఎస్ తమన్, ఏ ఆర్ రెహమాన్, ఎం ఎం కీరవాణి లాంటి స్టార్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ లందరినీ దాటుకొని ఇప్పుడు టాప్ డైరెక్టర్‌గా ఇండియాలోనే నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవడం ఆశ్చర్యకరమని చెప్పాలి. ఏది ఏమైనా అనిరుధ్ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినా… అతి తక్కువ సమయంలో ఈ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈయన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ధనుష్ అని చెప్పాలి. ఈ విషయాన్ని తాజాగా ఐశ్వర్యా రజినీకాంత్ మీడియ ముందే ఇటీవలే వెల్లడించారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు