Telugu Actress : బాత్ టబ్ లో మందుకొడుతున్న హీరోయిన్..

టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. RX100 తో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఆడియన్స్ ని పలకరించింది. అయితే పాయల్ కి ఎక్కువగా గ్లామర్ ప్రధాన్యత ఉన్న రోల్స్ రావడంతో నటన పరంగా నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ లాస్ట్ ఇయర్ రిలీజ్ వచ్చిన మంగళవారం సినిమాతో పాయల్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఏ గ్లామర్ రోల్స్ తో ట్రోల్ అయిందో, అదే గ్లామర్ రోల్ చేసి భావోద్వేగమైన నటనతో ప్రశంసలు అనుకుంది. ఇదిలా ఉండగా పాయల్ లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

సినిమాల కంటే సోషల్ మీడియా లోనే హడావిడి..

మామూలుగా పాయల్ రాజ్‌పుత్ నెట్టింట్లో ఎంతగా హంగామా చేస్తుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్లతో సందడి చేస్తూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ తన క్రేజ్ పెంచుకుంటుంది. అయితే పాయల్ ఎక్కువగా బోల్డ్ స్టిల్స్ పెట్టడం వల్ల ఎక్కువగా పాయల్ పై ట్రోలింగ్ జరుగుతుంటుంది. అందుకే కొన్నాళ్ళు ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ ఎక్స్ పోజ్ చేస్తూ మోస్ట్ లు పెట్టలేదు. పైగా ఈ మధ్య ఆమె నెట్టింట్లో కాస్త తక్కువ యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపించింది. అందువల్ల ఆమె మీద ట్రోలింగ్ కూడా ఎక్కువగా జరగలేదు. అయితే కరోనా టైంలో, కెరీర్ ప్రారంభంలో మాత్రం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యేది. ఆ ట్రోలింగ్స్ చూసి చాలా డిప్రెస్ అయ్యానని, అది చూసి తన తల్లి ఎంతో బాధపడిందంటూ పాయల్ ఎంతో ఆవేదన చెందింది.

- Advertisement -

బాత్ టబ్ లో మందుగ్లాసుతో..

అయితే పాయల్ తన సినిమాలతో కన్నా.. ఇలా ఇంస్టాగ్రామ్ లో చేసే పోస్టులతోనే ఎక్కువగా క్రేజ్ దక్కించుకుంది. తాజాగా పాయల్ ఓ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూస్తుంటే అది ఏదో సినిమా షూటింగ్, లేదా యాడ్ కోసం షూట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇక ఆ పోస్ట్ లో బిహైండ్ ది కెమెరా అన్నట్టుగా వర్కింగ్ వీడియోను షేర్ చేసింది. అయితే ఇందులో నలుగురు భామలతో కలిసి బాత్ టబ్బులో వయ్యారంగా పోజులు పెట్టి చేతిలో మందు గ్లాసుతో కనిపించింది పాయల్. ఇక ఈ వీడియో నెటిజన్ల కంట పడగా, పాయల్‌ను చాలా ట్రోల్ చేస్తున్నారు. ఇదేం వీడియో.. నువ్వు అసలేం చేస్తున్నావ్.. ఇలా బాత్ టబ్ లో అందరినీ చూస్తుంటే ఏదో తేడాలా ఉందే అంటూ ఇలా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది పాయల్ వీడియో కాబట్టి మరింత ఎక్కువగా ట్రోలింగ్ అవుతోంది.

పాయల్ సినిమాల విషయానికి వస్తే..

RX 100 సినిమాతో పాయల్‌కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఆ మూవీ తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్‌ కోసం మళ్ళీ అదే డైరెక్టర్ సినిమాతో వచ్చింది. గత ఏడాది మళ్లీ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాతో పాయల్ ట్రెండ్ అయింది. పాయల్ అద్భుతంగా కనిపించిందని, నటించిందని నెటిజన్లు ప్రశంసించారు. కానీ మంగళవారం బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆమెకు మళ్లీ అవకాశాలు మాత్రం వస్తున్నట్టుగా కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగులో కిరాతక అనే సినిమా, తమిళ్ లో మరో సినిమాలో నటిస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు