Telugu New Movie: ప్రియాంక మోహన్ లక్కీ గర్ల్… వరుసగా స్టార్ హీరోల సినిమాలే?

ప్రియాంక అరుళ్ మోహన్… ఫస్ట్ సినిమా గ్యాంగ్ లీడర్ తోనే తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది. అయితే గ్యాంగ్ లీడర్ లో ప్రియాంక మోహన్ కి అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే సినిమా ఛాన్స్ లు కూడా వచ్చాయి. కానీ ఏవీ కూడా కెరీర్ కు యూజ్ కాలేదు. దీంతో కోలీవుడ్ గడప తొక్కిన ప్రియాంక మోహన్ కి అక్కడ సక్సెస్ దొరికింది.

సూర్యతో ఈటీ, శివకార్తికేయన్ తో డాక్టర్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం కెప్టెన్ మిల్లర్ లోనూ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. హిట్స్ అందుకున్న తర్వాత కోలీవుడ్ కే పరిమితం కాకుండా, మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసింది వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాలో బంపర్ ఆఫర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే కెరీర్ సెట్ అయినట్టే. అవకాశాలు అవ్వే వస్తాయని అందరూ అనుకున్నారు.

అనుకున్నట్టే.. నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది. అంటే తెలుగులోకి వచ్చిన వెంటనే చేతిలోకి రెండు సినిమాలు వచ్చి పడ్డాయి. తాజాగా మరో సినిమాకు కూడా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేయడానికి ప్రియాంక మోహన్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సంప్రదింపులు కూడా అయిపోయాట. డేట్స్ క్లారిటీ వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది.

- Advertisement -

కాగా, మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో ముందుగా రష్మిక మందన్నాను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, రష్మిక తప్పుకోవడంతో కృతి శెట్టి ని సంప్రదించారు. కానీ, కృతికి ప్రస్తుతం ఇతర సినిమాలు ఉండటంతో డేట్స్ విషయంలో క్లాష్ వస్తుందని రిజెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ ఆఫర్ ప్రియాంక అరుళ్ మోహన్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇది ఒకే అయితే, ప్రియాంకకు తెలుగులోనే మూడు సినిమాలు ఉన్నట్టు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు