Best Foods For Skin Health: హెల్తీ స్కిన్ కోసం తీసుకోవాల్సిన ఫుడ్స్..!

మనం తీసుకునే ఫుడ్ హెల్త్ మీద మాత్రమే కాకుండా స్కిన్ మీద కూడా ఇంపాక్ట్ చూపుతుంది. కొన్ని డిసీజెస్ కి లక్షణాలు కూడా స్కిన్ లో కనిపిస్తుంటాయి. మనం హెల్తీగా ఉన్నామా లేదా అన్నది మన స్కిన్ హెల్త్ కూడా డిసైడ్ చేస్తుంది. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న స్కిన్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిష్:

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలు స్కిన్ హెల్తీగా ఉండటానికి దోహదపడతాయి. రెగ్యులర్ గా చేపలు మన డైట్ లో తీసుకోవటం వల్ల స్కిన్ హెల్తీగా ఉండటమే కాకుండా ఇన్ఫ్లేమేషన్ వంటి సమస్యల నుండి దూరంగా ఉంచటమే కాకుండా కొత్త స్కిన్ సెల్స్ పెరగటానికి హెల్ప్ అవుతుంది.

ఆవకాడోస్ :

ఆవకాడోస్ లో హెల్తీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హెల్తీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల స్కిన్ హెల్త్ మెరుగుపడుతుంది. సరిపడా హెల్తీ ఫ్యాట్ మన డైట్ లో ఉండటం వల్ల స్కిన్ ఫ్లెక్సిబుల్ గా, మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది.

వాల్నట్స్:

వాల్నట్స్ లో స్కిన్ హెల్తీగా ఉండటం కోసం అవసరమయ్యే చాలా పోషకాలు ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల మన స్కిన్ హెల్తీగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

సన్ ఫ్లవర్ సీడ్స్:

సాధారణంగా నట్స్, సీడ్స్ లో స్కిన్ బూస్టింగ్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ దీనికి చక్కటి ఉదాహరణ. 28గ్రాముల సన్ ఫ్లవర్ సీడ్స్ లో 49% విటమిన్ E, 41% సెలీనియం, 14% జింక్, 5.5% ప్రోటీన్ లు ఉంటాయి, ఇవి స్కిన్ హెల్తీగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

స్వీట్ పొటాటోస్ :

మొక్కల్లో ఉండే బెటా కరోటిన్ స్కిన్ గ్లోను కాపాడటంలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది స్వీట్ పొటాటోస్ లో అధికంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి చర్మం పొడిబారటం, ముడతలు పడటం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

బ్రొకోలి:

బ్రొకోలీలో స్కిన్ హెల్త్ కి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో జింక్, విటమిన్ A, C అధికంగా ఉంటాయి కాబట్టి ఇది రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల హెల్తీ స్కిన్ పొందవచ్చు.

టమోటాలు:

మనం రెగ్యులర్ వంటల్లో వాడే టమోటాలు స్కిన్ హెల్త్ ని కాపాడతాయని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇందులో విటమిన్ C, ఎక్కువగా ఉండటం వల్ల సూర్యరశ్మి నుండి చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

డార్క్ చాకోలెట్:

డార్క్ చాకోలెట్ లో కోకోవా స్కిన్ హెల్త్ ని కాపాడటంలో కీ రోల్ ప్లే చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే కోకోవాను 6నుండి 12వారాలు రెగ్యులర్ గా తీసుకుంటే గనక స్కిన్ హెల్త్ చాలా మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు