Devara Shooting Update: ఫుల్ స్పీడ్ మీదున్న దేవర – సముద్రతీరమే టార్గెట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఆచార్య ఫలితం తర్వాత కొరటాల శివ కూడా దేవర సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమా హిట్ కొట్టి… ఇప్పటి వరకు వచ్చిన ట్రోల్స్, అవమానాలు అన్నింటికీ సమాధానం చెప్పాలని చూస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ అయితే, సౌత్ ఇండస్ట్రీలో తన తొలి చిత్రం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని పని చేస్తోంది.

అలా దేవర టీం మొత్తం కసితో షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. అయితే డైరెక్టర్ కొరటల శివ ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. యాక్షన్ సీన్స్ అయిపోయిన తర్వాత ఇతర పార్ట్ ని షూట్ చేయాలని నిర్ణయించుకున్నాడట. అందులో భాగంగా సముద్రతీరంలో యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నాడట. ప్రస్తుతం దేవర షూటింగ్ గోవాలో జరుగుతుంది.

దీని తర్వాత కర్ణాటకలో గోకర్ణ లోని సముద్ర తీరంలో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ రెండు ప్లెస్ లలో సినిమాలో ఉన్న ముఖ్యమైన యాక్షన్ సీన్స్ నే షూట్ చేస్తున్నారట. సముద్ర మధ్యలో జరిగే పోరాట సన్నివేశాలపై కొరటాల శివ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందు కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ను కూడా వాడుతున్నాడట. కాగా, దేవర సినిమాకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. వారి పర్యవేక్షణలోనే దేవర సినిమాలోని సముద్ర తీరంలో పోరాట సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది.

- Advertisement -

కాగా, డైరెక్టర్ కొరటాల శివ ప్లానింగ్ చూస్తే.. ఎన్టీఆర్ అభిమానుల్లో దేవర సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్ లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movies news, cinema news in telugu, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News and gossip from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు