Manchu Vishnu : కన్నప్ప కోసం డాన్స్ మాస్టర్… అంత అవసరం ఉందంటారా?

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి “కన్నప్ప” అలనాటి క్లాసిక్ చిత్రం భక్త కన్నప్పకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. నిజానికి ఈ సినిమా మొదలైనపుడు ఏ హైప్ గాని, ప్రేక్షకుల్లో సగటు అభిప్రాయం కూడా లేదు. ఎందుకంటే మంచు ఫ్యామిలీ ట్రాక్ రికార్డు అలాంటిది. దాదాపు గత పదేళ్లలో ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. అయితే ఎప్పుడైతే ప్రభాస్ కన్నప్ప సినిమాలో ఎంటర్ అయ్యాడో అప్పట్నుంచి ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా వైరల్ అవుతుంది. ప్రభాస్ శివుడుగా స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనున్న ఈ చిత్రంలో నయనతార పార్వతిగా నటించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు.

భారీ తారాగణం, టెక్నిషియన్స్..

మంచు మోహన్ బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్, మమ్మూట్టి, శరత్ కుమార్, ఇలా చాలా మంది లెజెండరీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా బాలకృష్ణ కూడా ఈ సినిమాలో కీ రోల్ లో నటించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అలాగే పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన టెక్నీషియన్లను రంగంలోకి దింపుతున్నారు. ఇండియాలో బెస్ట్ వన్ అఫ్ ది బెస్ట్ కెమెరామెన్లను కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక హిందీ మహాభారత్ సిరీస్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -

ప్రభుదేవా ఎంట్రీ..

అయితే తాజా సమాచారం ప్రకారం కన్నప్ప మూవీ కోసం స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రంగంలోకి దింపారు చిత్ర యూనిట్. ఇక ‘కన్నప్ప’ షూటింగ్ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు నెలల లాంగ్ షెడ్యూల్ అక్కడ జరుపుకోగా, గత నెలలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అయితే తాజాగా న్యూజిలాండ్ లో మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇక కన్నప్ప కోసం ప్రభుదేవా న్యూజిల్యాండ్ లో ల్యాండ్ అయ్యాడని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ఈ షెడ్యూల్ లో ఆయన కొరియోగ్రఫీలో పాటలు చిత్రీకరిస్తున్నట్టు మేకర్స్ తెలియచేసారు.

డాన్స్ కి అంత స్కోప్ ఉందా?

అయితే కొంతమంది నెటిజన్ల అభిప్రాయం ప్రకారం కన్నప్ప సినిమా భక్తి ప్రధానంగా సాగే సినిమా కాబట్టి ఈ సినిమాలో డాన్స్ కి అంత స్కోప్ ఉందా అని కొందరి అనుమానం. మహా అయితే కథలో కన్నప్ప కి గూడెం రాజుని చేసినపుడు సెలబ్రేషన్ సాంగ్ ఉండవచ్చు. అలా అనుకున్నా మంచు విష్ణు గత సినిమాల్లో పెద్దగా డాన్స్ చేయలేదు కూడా. ఇక డాన్స్ మాస్టర్ గా ప్రభుదేవానే తీసుకున్నారు ఎందుకు అంటే, బహుశా మూవీలో లెజెండరీ నటులు నటిస్తున్నందుకు డాన్స్ మాస్టర్ ని కూడా అలాంటి వ్యక్తినే తీసుకుంటే బాగుంటుందని తీసుకున్నారా అని కూడా అనుకోవచ్చు. అయితే ఇదంతా సరే అనుకున్నా, అసలు ఈ ఇతిహాస భక్తిరస చిత్రాన్ని న్యూజిలాండ్ లో షూట్ చేయడం ఏంటో అర్ధం కావట్లేదని నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా క్లాసిక్ సినిమాని చెడగొట్టకుండా, ప్రేక్షకుల నుండి విమర్శలు రాకుండా సినిమా బాగా తెరకెక్కిస్తే అంతే చాలు అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ చిత్రంలోని పాటలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని చిత్ర యూనిట్ అంటున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కుతోన్న షెల్డన్ చౌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, స్టీఫెన్ దేవస్సీ, మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు