Selva Raghavan: అరుదైన దర్శకుడు

సెల్వ రాఘవన్ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి సెల్వ రాఘవన్ తమిళ దర్శకుడు అయిన కూడా తెలుగు ప్రేక్షకులుకు కూడా సుపరిచితమని చెప్పొచ్చు. సెల్వ రాఘవన్ తెరకెక్కించిన సినిమాలు అద్భుతం. సెల్వ రాఘవన్ కి తెలుగులో కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక సినిమాను ఇలా కూడా తీయొచ్చు అని సంచలనాత్మకమైన సినిమాలను సెల్వ రాఘవన్ తెరకెక్కించాడు. సెల్వ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందరి దర్శకులులా కాకుండా తన పంథా వేరు అంటూ నిరూపించాడు. తన అనుకున్న కథని అనుకున్నట్లు చెప్పటం ఆయనకు మాత్రమే చెల్లింది.

“తుళ్లువదో ఇలామై” సినిమా దర్శకుడుగా ప్రారంభమైన సెల్వ రాఘవన్ కెరియర్ లో ధనుష్ తో కొన్ని వరుస సినిమాలను చేశాడు. కాదల్ కొండెన్ , పుదు పెట్టేయ్, మయక్కం ఎన్న వంటి సినిమాలు ధనుష్ తో చేసి దర్శకుడుగా మంచి పేరు అందుకున్నాడు. అయితే సెల్వ రాఘవన్ చేసిన 7జి బృందావన్ కాలనీ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. 7జి బృందావన్ సినిమాకి ఇప్పుడు చూసిన కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. ఒక సూపర్ హిట్ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనడానికి ఈ సినిమా సెలబ్రేషన్ నిదర్శనం అని చెప్పొచ్చు.

సెల్వ రాఘవన్ కెరియర్ లో ఇప్పటికి బెస్ట్ ఫిల్మ్ అంటే యుగానికి ఒక్కడు అని చెప్పొచ్చు. కార్తీ నటించిన ఈ సినిమా ఎన్నో సంచలనాలుకు దారితీసింది. అయితే ఒక దర్శకుడిగా సెల్వరాఘవనికి కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. యుగానికి ఒక్కడు ద్వారా సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమాలను చూపించడంలో సక్సెస్ అయ్యాడు సెల్వ రాఘవన్ చెప్పొచ్చు.

- Advertisement -

తనకొచ్చిన థాట్ ని రా & రస్టిక్ గా చెప్పే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఉన్న దర్శకులు అలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీరు అందరికంటే ముందే ఎప్పుడో సెల్వ రాఘవన్ ఈ ప్రయత్నం చేశాడు. రీసెంట్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ సినిమాలో నటుడుగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ సెల్వ రాఘవన్ కి మాత్రం మంచి గుర్తింపు లభించింది.

సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఎక్కువ సినిమాలకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఇకపోతే లేటెస్ట్ గా తెరకెక్కించిన సినిమా నేనే వరువన్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. సెల్వ రాఘవన్ ఇప్పుడు 7జి బృందావన్ కాలనీ సినిమాకి సీక్వెల్ గా సినిమా చేస్తున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. అయితే 7జి బృందావన్ కాలనీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ దానికి సీక్వెల్సీక్వెల్ గా సినిమా వస్తుంది అని అంటే అంచనాలు కూడా వేరే లెవెల్ లో ఉంటాయని చెప్పొచ్చు.

ఎన్నో సంచలనాత్మకమైన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సెల్వ రాఘవన్ Filmify.in తరుపునుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు